Jagadeesh reddy: లండన్ ఆవిర్భావ వేడుకల్లో జగదీష్ రెడ్డి
లండన్ ఎన్ఆర్ఐ బీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ప్రజా దీవెన, లండన్: లండన్ ఎన్ఆర్ఐ బీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు(Telangana formation day) ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. లండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను(martyrs of Telangana) స్మరించుకుంటూ జగదీ ష్ రెడ్డి, లండన్ బీఆర్ఎస్ శాఖ(BRS Party) సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్య క్షులు నవీన్ రెడ్డి, అధికార ప్రతిని ధులు రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జీ సురేష్ బుడగం, కోశాధికారి సతీశ్ గొట్టి ముక్కుల, సెక్రటరీ సత్య చిలు ముల, బోనగిరి నవీన్, ప్రశాంత్ మామిడాల ఉన్నారు.
Telangana formation day celebrations in London