Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC By Election counting: ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైందని , బ్యాలెట్ పేపర్స్ బండిల్స్ కట్టె ప్రక్రియ కొనసాగుతోంది,

నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి ఉప ఎన్నికల కౌంటింగ్(MLC by Election counting) ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైందని , బ్యాలెట్ పేపర్స్ బండిల్స్ కట్టె ప్రక్రియ కొనసాగుతున్నదని, బండిల్స్ కట్టే ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తవుగానే మొదటి ప్రాధాన్యత(First priority votes) ఓట్ల లెక్కింపు మొదల వుతుందని వరంగల్- ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభ ద్రుల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధి కారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన అన్నారు. కౌంటింగ్ సందర్భంగా బుధవారం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (Counting of by-election votes)జరుగు తున్న అనిశెట్టి దుప్పలపల్లి గోదా ము వద్ద ఆమె మీడియాతో మాట్లా డారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఒక్కో హాల్లో 24 టేబుల్ లో చొప్పు న నాలుగు హాల్లో ఈసారి 96 టేబు ల్స్ ఏర్పాటు చేశామని, ఒక్కో టేబు ల్ కు 500 చొప్పున ఒక రౌండ్ లో 48 వేల ఓట్ల లెక్కింపు జరుగుతుం దని తెలిపారు.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సందర్భంలోనే చెల్లిన ఓట్లను, చెల్లని ఓట్లను వేరు చేసి లెక్కిస్తారని చెప్పారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 7 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని, మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలనట్టయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సైతం ఇదే పద్ధతిలో కొనసాగుతుందని తెలిపారు. నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ ఎం ఎల్ సి ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కేంద్రం వద్ద మూడం చల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, అన్ని ర్యాంకులకు చెందిన 800 మంది పోలీసులు కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తులో పనిచేస్తున్నారని తెలిపారు. ఒక్కో కౌంటింగ్ హాల్ వద్ద డీఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుందని, కౌంటింగ్ పూర్త య్యే వరకు ఇదే భద్రత కొనసాగు తుందని తెలిపారు.

MLC by election counting started