YS Sharmila: ప్రజా తీర్పును శిరసావహిస్తాం
ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో(Andhra Pradesh Lok Sabha Elections) ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఆశిస్తున్నాం
అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరతాం
ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో(Andhra Pradesh Lok Sabha Elections) ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. బుదవారం మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు(Chandrababu naidu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు(Pawan kalyan) శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభి వృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె సూ చించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు రావాలని ఆకాక్షించారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. అలాగే రాజధానిని నిర్మించాలని సూచించా రు. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా కొనసాగాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి ప్రత్యేక హోదా(special status), విభజన హామీ లకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభు త్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. భవిష్యత్తు లోను పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన కాంగ్రెస్ నిలబడి ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతామని ఆమె చెప్పారు.
YS Sharmila wishes to chandrababu naidu and pawan kalyan