Schools reopen: చక..చక చదువుల కాలం
రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు ప్రారంభమైనట్టే చక చక చదువుల కాలం ప్రారంభమై ప్రవేశాలు కొనసా గుతున్నాయి.
విద్యా సంవత్సరo ప్రారంభంతో జోరందుకున్న కొత్త ప్రవేశాలు
పాఠశాల, ఇంటర్, డిగ్రీ అడ్మిషన్ లతో పాటు సాంకేతిక విద్యా కోర్సు ల హడావుడి
ఈ నెల 12 నుంచి స్కూల్స్ పునః ప్రారంభానికి సర్వం సన్నద్ధం
తెలంగాణలో రేపటి నుంచి బది లీలు, పదోన్నతులకు శ్రీకారం
యూనీవర్శిటీల వైస్ ఛాన్సలర్ ల నియామకంపై సైతం దృష్టి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు కాలేజీల్లో తరగతులు ప్రారంభం
ప్రజా దీవెన, హైదరాబాద్: రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు ప్రారంభమైనట్టే చక చక చదువుల కాలం ప్రారంభమై ప్రవేశాలు కొనసా గుతున్నాయి. ఈ క్రమంలో తెలం గాణలో(Telangana) ఎన్ని కల హడావుడి ముగి యడంతో విద్యా రంగంపై అధికా రులు దృష్టి సారించారు. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశా లలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లల్లో మౌలిక సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయాలని జిల్లా అధికా రులకు ఆదేశాలు వెళ్ళాయి.ఇక ఇం టర్ బోర్డ్ ప్రవేశాల మొదలు, ఉన్న త విద్యా మండలి కార్యక్రమాలు, యూనివర్శిటీల ప్రక్షాళన వరకు అన్ని అంశాలపై దృష్టి పెట్ట బోతు న్నట్టు అధికారులు తెలిపారు. ప్రతీ అంశంపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు.
ప్రా ధాన్యత క్రమంలో పరిష్కారం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించా రు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉపా ధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు దీన్ని చేపట్టాలని భావించినా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపో యింది. గత ఏడాది కొంతమంది టీచర్లను బదిలీ చేశారు కానీ ఇప్ప టి వరకూ రిలీవ్ చేయలేదు. దాదా పు 50 వేల మంది టీచర్లు బదిలీ(Transfer of teachers)కోసం దరఖాస్తులు చేసుకున్నారు.మరోవైపు 10 వేల మంది టీచర్ల వరకూ పదోన్నతులు పొందాల్సి ఉంది. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ నుంచి హెచ్ఎం వరకూ ప్రమోషన్లు ఇవ్వడానికి సీనియారిటీ జాబితా కూడా రూ పొందించారు. ఎన్నికల కోడ్ ముగి యడంతో ఈ నెల 7వ తేదీ నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
జోరుగా విద్యాసంస్థల్లో అడ్మిషన్లు.. ఇంటర్ అడ్మిషన్లకు(Inter admissions)అనుగుణంగా ఇంటర్ కాలేజీలకు బోర్డ్ అనుబంధ గుర్తింపు ఇప్పటికే చాలావరకు పూర్తి చేసింది. ఇంకా 600 ప్రైవేటు కాలేజీలకు ఇవ్వాల్సి ఉంది. ఈ నెలాఖరు కల్లా అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని అధికా రులు ఆదేశించారు. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ప్రవేశాలు ఊపందుకున్నాయి.గత ఏడాది 80 వేల మంది విద్యా ర్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ఈ సంవత్సరం మరికొంత మంది చేరే వీలుంది. టెన్త్ ఉత్తీర్ణులకు అవ సరమైన డిప్లొమా కోర్సుల కౌన్సెలిం గ్ (Counseling for Diploma Courses)ప్రక్రియను జూన్ నుంచి మొదలు పెట్టే వీలుంది. డిగ్రీ ప్రవేశాలను వేగంగా చేపడుతున్నారు. తొలి దశ సీట్ల కేటాయింపు ఈ నెల 6వ తేదీ న జరుగుతుంది.
డిగ్రీలో ఏటా 2. 20 లక్షల మంది చేరుతున్నారు.ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కూ చురు కుగా ఏర్పాట్లు ఇంజనీరింగ్ కౌన్సె లింగ్ షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటిం చారు. ఈ నెలాఖరు నుంచి ఆన్ లైన్ దర ఖాస్తులు ప్రక్రియ మొదలు పెడతారు. రాష్ట్రంలో 1.06 లక్ష ల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 80 వేల వర కూ కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ జూలై నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా రు. ఈ నేపథ్యంలో అవసరమై న అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
వీసీల నియామకాలపై దృష్టి.. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాల యా ల్లో కొత్త వైస్ ఛాన్సలర్ల(Vice Chancellors)నియామకం కోసం చురుకుగా ఏర్పాట్లు జరుగు తున్నాయి. పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం సెర్చ్ కమిటీలను కూడా నియ మిం చింది. మే నెలాఖరుతో వీసీల పద వీ కాలం ముగిసింది. వీరి స్థానంలో ఐఏఎస్‌లను ఇన్ఛార్జిలుగా నియ మించారు. ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండటంతో వీసీల నియామకం ఇం త కాలం చేపట్టలేదు. సెర్చ్ కమిటీ భేటీ అయిన, ఒక్కో వర్శిటీకి ముగ్గు రు చొప్పున ఎంపిక చేసి ప్రభుత్వా నికి నివేదిక అందజేస్తుంది. ఇందు లో ఒకరిని వీసీగా నియమిస్తారు. ఈ ప్రక్రియ మరో పది రోజుల్లో జరగొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
Schools started june 12th