Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ఏపీ ఉపాధ్యాయ బదిలీలు నిలిపివేత

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలు నిలిపివేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో గతంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివే శారు.

కొత్త ప్రభుత్వం ప్రమాణం కాక ముందే ప్రతి చర్యలు ప్రారంభం
వైసీపీ ప్ర‌భుత్వంలో అక్రమంగా 1800 మంది బ‌దిలీలు
నాటి మంత్రి బొత్స చేతివాటం తోనేనని ఆరోప‌ణ‌ల నేపద్యంలో

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలు(Govt Teacher Transfers)నిలిపివేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో గతంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివే శారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి బదిలీలూ చేపట్టొ ద్దని డీఈవోలకు ఏపీ పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేష్ కుమా ర్(Education Commissioner S. Suresh Kumar) స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఉత్తర్వులు జారీ చేశారు.ఎన్నికలకు(Elections) ముందు మొత్తంగా 1,800 మంది టీచర్ల బదిలీలు జరిగాయి. అయి తే, పైరవీలు, సిఫార్సులతో ఈ బదిలీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ(Education Minister Botsa Satyanarayana)ఒత్తి డితో ఈ సిఫార్సులు జరిగాయనే అభియోగాలు కూడా వచ్చిన నేప థ్యంలో మొత్తంగా బదిలీలనే నిలిపి వేయాలనే నిర్ణయానికి వచ్చింది విద్యాశాఖ(Department of Education). కాగా ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు గత ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చి బదిలీ లకు సంబంధించిన మార్గదర్శకా లతో జీవో నెంబర్ 47 జారీ చేసింది.

2023 ఏప్రిల్‌ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్లందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించిం ది. గతంలో జారీ చేసిన మార్గదర్శ కాల ప్రకారం మే 31, 2025 లేదా అంతకంటే ముందే ఉద్యోగ విరమ ణ చేసిన వారికి అభ్యర్ధన మేరకు బదిలీలు చేపట్టాలని, 2022-23 విద్యా సంవత్సరం నాటికి ఒకే చోట అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రేడ్ -2(Grade -2)ప్రధానోపాధ్యాయులు ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఇతర ఉపాధ్యాయులు తప్పనిసరిగా బది లీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ మేనే జ్ మెంట్ సర్వీసులో కొనసాగుతు న్నారో ఆ విభాగంలోనే బదిలీ అ య్యేలా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిం చాలని కూడా నిర్ణయించారు. ఇం దులో భాగంగా తొలి ద‌శ‌లో 1800 మందిని బ‌దిలీ చేశారు. అయితే రాష్ట్రంలో అధికార బదిలీ జరిగిన నేపథ్యంలో విస్తృత స్థాయిలో వివా దాస్పదమైన ఉపాధ్యాయ బదిలీ లకు సంబంధించి కొత్త ప్ర‌భుత్వం రానున్న త‌రుణంలో మొత్తంగా టీచర్ల బదిలీలకు బ్రేక్‌ పడడం గమనార్హం.

Suspension of AP teacher transfers