Badibata: బడిబాట ప్రారంభించిన అమ్మ ఒడి ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జి ఇందిర
నాంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని అమ్మ ఒడి ఆదర్శ పాఠశాల చైర్మన్ మండల సమైక్య అధ్యక్షురాలు జి ఇందిర ప్రారంభించారు.
బడిబాట ప్రారంభించిన అమ్మ ఒడి ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జి ఇందిర
ప్రజా దీవెన, నాoపల్లి: నాంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం లో ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar)బడిబాట కార్యక్రమాన్ని అమ్మ ఒడి ఆదర్శ పాఠశాల చైర్మన్ మండల సమైక్య అధ్యక్షురాలు జి ఇందిర(G Indira) ప్రారంభించారు. అనంతరం బ్రోచర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు,(Text books)నోట్ బుక్స్, రెండు జతల ఉచిత యూనిఫామ్, రుచికరమైన శుచికరమైన మధ్యాహ్న భోజనం వారంలో మూడు రోజులు ఉడకబెట్టిన గుడ్లు, వారంలో మూడు రోజులు రాగి జావా, క్రీడా శిక్షణలు, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు ఉన్నాయి అని ఆమె అన్నారు. ఈ కార్యక్ర మంలో ప్రధానోపా ధ్యాయు లు సంజీవరావు,(Sanjeeva Rao) ఉపాధ్యాయులు, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Badibata started in Nampally