MLC elimination:ముమ్మరంగా కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఎలిమినేషన్
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నికల రెండవ ప్రాధాన్య త ఓట్ల కౌంటింగ్ ఎలిమినేషన్ ప్రక్రి య ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇప్పటి వరకు 42 మంది అభ్య ర్థులు ఎలిమినేషన్
గెలుపునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లు
మ్యాజిక్ ఫిగర్ కు 31,386 ఓట్ల దూరంలో కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న
ప్రజా దీవెన, నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నికల(MLC by-elections) రెండవ ప్రాధాన్య త ఓట్ల కౌంటింగ్ ఎలిమినేషన్ ప్రక్రి య ముమ్మరంగా కొనసాగుతోంది. గడిచిన రెండు రోజులుగా కొనసాగుతున్న ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో మూడో రోజైన శుక్రవారం మధ్యాహ్నం వరకు పోటీలో ఉన్న 42వ అభ్యర్ధి కూడా ఎలిమినేషన్ కావడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ కార్యక్రమo తర్వాత ప్రస్తుత ఆదిక్యo లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna) 18,708 ఓట్ల మెజార్టీతో ముందుకు సాగుతున్నాడు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు కావాల్సిన కోటా ఓట్లు1,55,095 గా ఉన్నాయి. ఈ క్రమంలో ఆధిక్యత లో ఉన్న తీన్మార్ మల్లన్న1,23,709 ఓట్లతో కొనసాగుతుండగా బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి(Rakesh Reddy) 1,04,846 ఓట్ల తో గట్టి పోటీ ఇస్తున్నాడు.
అదే సం దర్భంలో బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి(Premender Reddy) 43,712 ఓట్లతో, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ 29,915 ఓట్లతో కొనసాగుతున్నా రు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి తీ న్మార్ మల్లన్న గెలుపుకు కావాల్సిన ఓట్లు 31,386 కావాల్సి ఉంది. అదే సందర్భంలో బిజేపి అభ్యర్థి ప్రేమే oధర్ రెడ్డికి వచ్చిన మొదటి ప్రాదా న్యత ఓట్లు 43,313 కాగా ఆయన కు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య త ఓట్ల లో వచ్చే ఫలితాల మేరకు విజేత ఎవ రనేది తేలనుంది. ఇది లా వుండగా మూడు హాల్స్ లో ప్రత్యేక టేబుల్ల లో ఎలిమినేషన్ ప్రక్రియ(Process of elimination) కొనసా గుతుండగా సాయంత్రం 6 గంటల లోపు తుది ఫలితం వెలువడనుం దని అధికారిక వర్గాలు పేర్కొన్నా యి.
The ongoing MLC elimination