మెట్రో ప్రయాణీకులకు శుభవార్త
ప్రజాదీవెన /హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల మెట్రో రైలు ప్రయాణంలో ఎదురవుతున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. మెట్రో రైలు ప్రయాణంలో అనేక అనుకూల వాతావరణం నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణీకులు ఎక్కువగా మెట్రోపైనే ఆధారపడుతున్నారు.
మెట్రో రైలు ప్రయాణంతో సమయం తో శారీరక మానసిక ఒత్తిడిని జయించే అవకాశం ఉందని తెలుసుకున్న ప్రజలు చాలామంది మెట్రో సేవలను సద్వినియోగపరచుకుంటున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే క్యాబ్‌లు, ఆటోల్లో ధరలు అధికంగా ఉండటం ok ఎత్తైతే ప్రధానంగా ట్రాఫిక్ సమస్య కారణంగా మెట్రో నగర వాసులు మెట్రో ప్రయాణానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రయాణికులకు సరిపడా బోగీలు… ప్రయాణీకుల రద్దీకి సరిపోయే బోగీలు లేకపోవడంతో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మెట్రో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బోగీల సంఖ్య పెంచాలనే డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆగస్టు నుంచి మూడు అదనపు కోచ్ లను మెట్రో రైళ్లకు ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే ప్రతి రోజు హైదరాబాద్ మెట్రోలో 5.10లక్ష మంది ప్రయాణిస్తుoడగా ప్యాసింజర్ల రద్దీ, ప్రయాణీకులకు కలుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా మెట్రో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.