Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tinmar Mallanna: తీన్మార్ మల్లన్న గెలుపు హర్షణీయం

నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC by election) కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna ) గెలుపు హర్షణీ యమని నల్లగొండ జిల్లా మున్నూ రుకాపు మహాసభ ప్రధాన కార్య దర్శి నాగులంచి స్వామి పేర్కొన్నా రు.

నల్లగొండ జిల్లా మున్నూరుకాపు మహాసభ కార్యదర్శి స్వామి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC by election) కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna ) గెలుపు హర్షణీ యమని నల్లగొండ జిల్లా మున్నూ రుకాపు మహాసభ ప్రధాన కార్య దర్శి నాగులంచి స్వామి పేర్కొన్నా రు.

ఎన్నికల్లో మల్లన్న పోటీ కి దిగగానే నల్లగొండ జిల్లాలో కొందరు పనిగట్టుకొని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలంగాణ పట్టభద్రులు ఓటు వేయడం ద్వారా ఆదరించి గెలిపించినoదుకు ఆయన కృత జ్ఞతలు తెలిపారు. మల్లన్న కు నెగటివ్ ట్రోలింగ్(Negative trolling), యూట్యూబ్ ఛానల్ లో(youtube channel) వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పిటికి గొప్ప మనసుతో అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికి అభినందనీయులని వ్యాఖ్యానిం చారు. అహర్నిశలు శ్రమించి మల్ల న్న గెలుపు కు కృషి చేసిన మున్నూ రుకాపు కులబంధువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పారు. ఇదే స్ఫూర్తి ని మున్ముందు కూడా కొన సాగిస్తారని ఆశించారు.

Tinmar Mallanna win in mlc by elections