Finally CBI notices to Avinash Reddy ఎట్టకేలకు అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
--ఆగస్టు 14న కోర్టుకు రావాలని సమన్లు
ఎట్టకేలకు అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
— ఆగస్టు 14న కోర్టుకు రావాలని సమన్లు
ప్రజా దీవెన/హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి
హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి ఎట్టకేలకు సిబిఐ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని వైకాపా ఎంపి అవినాష్ రెడ్డికి సమన్లు అందజేసింది.వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ ను సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఎంపి అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి,ఉదయ్ కుమార్ రెడ్డిపై ఛార్జిషీట్ వేసి వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా సిబిఐ అవినాష్ రెడ్డిని చేర్చింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు చేసిన కుట్రలో నిందితుల పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ దాఖలుచేసిన అభియోగ పత్రంలో A-6గా ఉదయ్ కుమార్ రెడ్డి, A-7గా వై.ఎస్.భాస్కరరెడ్డి, A-8గా వై.ఎస్.అవినాష్ రెడ్డి లను పేర్కొంది. వివేకా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎం.వి.కృష్ణారెడ్డి, వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాష్ ను ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంది.