Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Coca cola: కోకాకోలాకు సంపూర్ణ సహకారం

తెలంగాణ లో కోకా కోలా కంపెనీ ప్లాంట్ పెడి తే పూర్తి సహకారం అందిస్తామని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టా లని విజ్ఞప్తి
సంస్థ డైరెక్టర్ తో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి భేటీ

ప్రజా దీవెన, అమెరికా: తెలంగాణ లో కోకా కోలా కంపెనీ ప్లాంట్(Coca Cola Company plant)పెడి తే పూర్తి సహకారం అందిస్తామని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా వారు అట్లాం టాలోని కోకా కోలా హెడ్ క్వార్టర్స్ లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనథన్ రీఫ్(Jonathan Reiff)తో సమావేశమయ్యా రు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోకా కోలా యాజ మాన్యాన్ని ఆహ్వానించారు. దాదా పు గంటన్నరపాటు జరిగిన సమావే శంలో తెలంగాణలో(Telangana) పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను వివరించారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు జోనథన్ సాను కూలంగా స్పందించినట్లు మంత్రులు తెలిపారు. ఈ భేటీలో మంత్రులతో పాటు ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ జయేశ్ రంజన్, పెట్టు బడులశాఖ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి(Dr. Vishnuvardhan Reddy)తదితరులు పాల్గొ న్నారు.

Coca cola investment in hyderabad