Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Court Cases: రాజీ మార్గమే రాజమార్గం.

సుధీర్ఘ కాలంగా కోర్టులలో పెండింగ్ లో వున్న కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు రాజీ మార్గమే రాజ మార్గమని కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యాం సుందర్ అన్నారు.

కోదాడ: సుధీర్ఘ కాలంగా కోర్టులలో పెండింగ్ లో వున్న కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు రాజీ మార్గమే రాజ మార్గమని కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యాం సుందర్(Civil Judge N. Shyam Sundar)అన్నారు. శనివారం కోదాడ కోర్టులో(Kodada Court)నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాజీ పడతగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడడం వల్ల వారి సమయం, ధనం ఆదా అవుతాయని అన్నారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల గ్రామాలలో శాంతిభద్రతలు మెరుగుపడతాయని అన్నారు.

ఈ సందర్భంగా కోదాడ కోర్టులలో వున్న 3,847 కేసులను లోక్ అదాలత్(Lok Adalat)లో పరిష్కారం చేసారు. 16,87, 920 జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సీ హెచ్ సత్యనారాయణ(Magistrate CH Satyanarayana), బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కే మూర్తి(SRK Murthy), ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లు తాటి మురళీ, నాళం రాజన్న, అర్వపల్లి పవన్, ఆవుల మల్లికార్జున రావు, సీనియర్ న్యాయవాదులు మేకల వెంకట్రావు, పాలేటి నాగేశ్వర రావు, ఈదుల కృష్ణయ్య, రంజాన్ పాషా, దావీదు,ఉయ్యాల నర్సయ్య, మందా వెంకటేశ్వర్లు, బెల్లంకొండ గోవర్ధన్ , నాగుల్ పాషా , కంచర్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.

Way of compromise is right way