NEET-2024 Exam Irregularities: నీట్ పై అత్యున్నత స్థాయి కమిటీ
నీట్–2024 పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. 1,500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను సమీక్షించ డానికి నలుగురు సభ్యులతో కూడి న ప్యానెల్‌ను కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ప్రకటించింది.
నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాశాఖ
1,500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులపై విచారణ
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: నీట్–2024 పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. 1,500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను సమీక్షించ డానికి నలుగురు సభ్యులతో కూడి న ప్యానెల్‌ను కేంద్ర విద్యాశాఖ(Central Education Department)ఏర్పాటు చేసిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency)శనివారం ప్రకటించింది. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్త కాల్లో చేసిన మార్పులు, పరీక్ష కేంద్రాల్లో సమయం వృథా అయిన వారికి గ్రేస్ మార్కులు(Grace marks)కలపడం వంటివి కొంద రు విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించడానికి కారణమయ్యాయని తెలిపింది. 1,500 మంది అభ్యర్థుల ఫలితాలను సమీక్షించేందుకు అ త్యున్నత స్థాయి కమిటీ ఏర్పా టైంది.
యూపీ ఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ వారం రోజుల్లో సిఫారసు లతో కూడిన నివేదికను సమర్పి స్తుంది. దాని ప్రకారం ఈ అభ్యర్థుల ఫలితాలను సవరించే అవకాశం ఉంది’ అని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్(Subodh Kumar Singh)తెలిపారు. గ్రేస్ మార్కులతో పరీక్ష అర్హత ప్రమాణా లపై ఏ ప్రభావం ఉండ దని, అలాగే ఈ అభ్యర్థుల ఫలితా లు సమీక్షించడం అడ్మిషన్ల ప్రక్రియపై(Admissions Process) ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వ హణలో అవకతవకలు జరిగా యన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కమిటీ సిఫారసు లను అనుసరించి కొందరు విద్యార్థు లకు పరీక్ష మళ్లీ నిర్వహించే అంశం పై నిర్ణయం తీసుకుంటామన్నారు.
Supreme Committee NEET-2024 Irregularities