Celebrate the state conference:జూన్ 10 న జరిగే రాష్ట్ర సదస్సు జయప్రదం చేయండి
జాతీ య ఉపాధి హామీ పథకం రక్షణ కోసం జూన్ 10న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సు ను జేయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ పిలుపునిచ్చారు.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జాతీ య ఉపాధి హామీ పథకం(National Employment Guarantee Scheme) రక్షణ కోసం జూన్ 10న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సు ను జేయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ(Dandempalli Saroja) పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ(Nalgonda)పట్టణం 11వ వార్డు అర్బన్ కాలని లో హైదరాబాద్ లో జరుగు రాష్ట్ర సదస్సు కరపత్రం విడుదల చేసి ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ వామపక్షాల పోరాట ఫలితంగా ఏర్పడిన జాతీయ ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం(BJP Govt)క్రమంగా బడ్జెట్ తగ్గిస్తూ నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు.
ఉపాధి హామీ రక్షణ కోసం, కార్మికులకు పనిముట్లు అందించాలని అదేవిధంగా పని ప్రదేశాలలో వాటర్, టెంట్, మెడికల్ కిట్టు సదుపాయాలు కల్పించాలని రోజుకూలి 600 రూపాయలు 200 రోజుల పని దినాలు కల్పించాలని పాత బకాయిలు అందించాలని పారా గడ్డపార తట్టలు కార్మికులకు ప్రభుత్వము ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టి పట్టణ పేదలకు పని కల్పించాలని వారు కోరారు. గ్రామీణ ఉపాధిహామీ చట్టం అమ లు-సవాళ్లు,, అనే అంశంపై రాష్ట్ర సదస్సు జూన్10 ఉదయం 10:30 కు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister of Panchayat Raj Department Sitakka), అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, ఎంపి రాజ్య సభ సభ్యులు శివదాసం ముఖ్య అతిథులుగా హాజరవు తున్నా రు.
కావున కార్మి కులు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు. కార్య క్రమంలో తెలంగాణ వ్యవసా య కార్మిక సంఘం పట్టణ ఉపాధ్య క్షురాలు వడ్డే దనమ్మ(Vaddeh Danamma), మోగిలి పాలేపు ఇందిరా, వరికుప్పల తిరుపతమ్మ, నిరంజన్, మానక పద్మ, పర్వతం బొందయ్య, వడ్డే రాంరెడ్డి, కంకణాల విజయ, సంధ్య, బోడిగ పార్వతమ్మ, మల్లయ్య, గోల్కొండ కళమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Celebrate the state conference on June 10