Prajavani applications: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమంలో స్వీక రించిన దరఖా స్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దాసరి చందన జిల్లా అధికారులను ఆదేశించారు
నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి చందన
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రజావాణి(Prajavani ) కార్యక్రమంలో స్వీక రించిన దరఖా స్తులను(applications) తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దాసరి చందన(Collector dasari hari chandana) జిల్లా అధికారులను ఆదేశించారు.పార్లమెంటు ఎన్ని కలు, వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల అనంతరం తిరిగి ఈ సోమవారం ప్రారంభమైన ప్రజా వాణి కార్యక్ర మంలో ఆమె ప్రజల వద్ద నుండి వారి సమస్యల పై దరఖాస్తులను స్వీకరించారు.
రెండున్నర నెలల తర్వాత తిరిగి నిర్వహించిన ఈ ప్రజా వాని కార్యక్రమానికి జిల్లా కలెక్టరేట్ కు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు వచ్చి వారి సమస్యలపై జిల్లా కలెక్టర్ కు, అధికారులకు దరఖా స్తులు సమర్పించారు.ఈ సంద ర్భంగా ఫిర్యాదులను స్వీకరిస్తూ జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ కొన్ని ఫిర్యాదులకు అక్కడికక్కడే అధికారులను తన వద్దకు పిలిపించుకొని పరిష్కార మార్గం చేయగా, మరికొన్ని పరిశీ లించి ,విచారణ చేసి పరి ష్కరించా లని ఆదేశించారు. అనం తరం జిల్లా అధికారులతో ఆమె మాట్లా డుతూ ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నింటిని వెంటనే పరిష్కరించాలని ,జాప్యం చేయ వద్దని తెలిపారు.
జిల్లా కేంద్రంతో పాటు, డివిజన్, మండల స్థాయిలో వచ్చే దరఖాస్తులను సైతం ఇలాగే పరిష్కరించాలని ,ఆ విధంగా అన్ని స్థాయిలలో అధి కారులు పనిచేయాలని కోరారు. దరఖాస్తుదారులు సమ ర్పించిన ఫిర్యాదుల పరిష్కా రం గురించి ఫిర్యాదు దారులకు తెలియజేయా లని, పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని పరిష్కరిస్థూ, పరిష్కరిం చలేని వాటి సమాచారాన్ని సైతం స్పష్టంగా తెలియజేయాల్సిందిగా ఆదేశించారు.సోమవారం నాటి ప్రజావాణి దరఖాస్తులలో(Prajavani applications) వ్యక్తిగత సమస్య లతో పాటు, విద్య ఉద్యోగం, ఉపాధి, భూమి సంబం ధిత ఫిర్యా దులు ఎక్కువగా వచ్చా యి.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర, డిఆర్ఓ రాజ్యలక్ష్మి తో పాటు, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
Prajavani applications solved immediately