Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandrababu naidu: చంద్రబాబును చూడాలని ఓ మహిళ ఏమి చేసిందో తెలుసా

కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేం దుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీద కు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు.

కాన్వాయ్ వెంట మహిళ పరుగు లు పెడుతుంటే ఆగి మాట్లాడిన బాబు

ప్రజా దీవెన, విజయవాడ: కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని(Chandrababu Naidu) చూసేం దుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీద కు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఎ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్ర బాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్(Convoy)వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి….ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని తన పేరు నందిని(Nandini)అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది.

తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి….మా కోరిక మేరకు మీరు సిఎం అయ్యారు సార్….ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా… చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడాలని వచ్చాను అని నందిని చెప్పగా…ముందు ఆసుపత్రికి(Hospital)వెళ్లు అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని…. అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు(party leaders) చంద్రబాబు నాయుడు సూచించారు.

Chandra babu meets women in Convoy