Heavy rains: భాగ్యనగర్ లో భారీ వర్షం
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురి సింది. చార్మినార్ సర్దార్ మహల్ లో అత్యధికంగా 4.8, వారాసిగూడ బౌద్ధ నగర్ లో 4.7 సెం.మీ వర్షం కురిసింది.
హైదరాబాదులోని పలు ప్రాంతా ల్లో 4 సెం.మీ. వర్షపాతం నమోదు
నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో జోరుగా వానలు
నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్(Hyderabad)లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురి సింది. చార్మినార్ సర్దార్ మహల్ లో(Charminar Sardar Mahal)అత్యధికంగా 4.8, వారాసిగూడ బౌద్ధ నగర్ లో 4.7 సెం.మీ వర్షం కురిసింది. రామాంతాపూర్, కాప్రా, హయత్‌నగర్, బండ్లగూడ, అంబర్ పేట, నాచారం, హబ్సిగూడ ప్రాంతా ల్లో 4 సెం.మీ.కు పైగా వాన పడింది. ముషీరాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపు లతో భారీ వర్షం కురిసింది.
ప్రధాన రహదారుల పై వరద నీరు నిలిచి పోవడంతో ఎల్బీనగర్, ఉ ప్పల్ స్టేడియం, చిక్కడపల్లి, గాజుల రామారం ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తాయి. చందాన గర్, మియాపూర్, గచ్చిబౌలి, కు త్బుల్లాపూర్, సూరారం, జీడి మెట్ల, షాపూర్ నగర్, సుచిత్ర సెంటర్, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్ల లోతు వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డా రు. నగరంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని బేగంపేట వాతావరణ శాఖ(Begumpet Meteorological Department)తెలిపింది.
ఇక, ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాం తాల్లో మంగళవారం సాయంత్రం వర్షం పడింది. ఉట్నూర్ మండ లంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. మండలంలోని కొలాంగూడ వద్ద రోడ్డుపై భారీ వృక్షం పడిపోవడంతో ఇటు వైపు కొత్తగూడ చెక్‌పోస్టు వరకు, అటు దంతనపల్లి కొలాంగూడ వరకు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయా యి. అలాగే ఉట్నూర్(Utnoor)మంచిర్యాల ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూ లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వాన కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీన గర్ మండల కేంద్రంలో భారీగా, వలి గొండలో మోస్తరు వర్షం పడింది.
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు తెలంగాణలోని(Telangana) జిల్లాల్లో బుధవారం అక్కడక్కడ భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని హైద రాబాద్ వాతారణ కేంద్రం తెలిపిం ది. రంగారెడ్డి, సంగారెడ్డి, కామారె డ్డి, వికారాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, మహబూ బాబాద్, ములుగు, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, హన్మకొండ, మేడ్చ ల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తూర్పు పసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో(Pacific ocean surface temperature)అసాధారణ మార్పుతో ఎల్‌నినో స్థితి నుంచి లానినోకు మారతు న్నట్లు హైదరాబాద్ కు చెందిన ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస (ఇంకోయిస్) అంచనా వేసింది. పసిఫిక్ మహా సముద్రంపై లానినో పరిస్థితులు సంభవిస్తే అవి నైరుతి రుతుపవనాలకు(Southwest Monsoon)ఎంతో ప్రయోజన కారిగా ఉoటుందని అభిప్రాయప డింది. సాధారణంగా లానినో స్థితి ఎక్కువగా జూలై-సెప్టెంబరు మధ్య ఉంటుందని, అది 2025 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది.
Heavy rains in Hyderabad