Caribbean Kangaroo with Ashwin Maya…! అశ్విన్ మాయతో కరీబియన్ కంగారు…!
-- ఏకంగా ఏడు వికెట్లతో విండీస్ నడ్డివిరిచిన అశ్విన్ --ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా బోణీ --ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
అశ్విన్ మాయతో కరీబియన్ కంగారు…!
— ఏకంగా ఏడు వికెట్లతో విండీస్
నడ్డివిరిచిన అశ్విన్
–ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా బోణీ
–ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
ప్రజా దీవెన/డొమినికా: డొమినికా వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అశ్విన్ మాయాజాలంతో 130 పరుగులకే కుప్పకూలింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25లో టీమిండియా బోణీ కొట్టింది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌లో భాగంగా వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు తొలి మ్యాచ్ లో రోహిత్ సేన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి అతిథ్య విండీస్‌ను చిత్తు చేసింది. 312/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను మెుదలెపెట్టిన భారత్ 425/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల అధిక్యం లభించిన అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కరీబియన్ జట్టు భారత్‌కు ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ విజయాన్ని చేకూర్చింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని ఒంటి చేత్తో శాసించాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అశ్విన్ 12 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇదిలా ఉండగా అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌పై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ తన తొలి టెస్టులో 171 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 229 పరుగుల భారీ బాగస్వామ్యాన్ని నెలకొల్పాడని అభినందనలు తెలిపారు.