Badibata program: బడి ఈడున్న ప్రతి పిల్లవాడు బడిలో ఉండాలి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో భాగంగా బుధవారం పాఠశాల ల పున ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి చందన నల్గొండజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్న త పాఠశాలలో విద్యార్థులకు యూ నిఫామ్స్ , పుస్తకాలను పంపిణీ చేశారు.
నల్గొండ జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 1800 పాఠశాలల్లో పనులు
విద్యార్థులకు రెండున్నర లక్షల దుస్తుల పంపిణీ
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో(Professor Jayashankar Badibata program) భాగంగా బుధవారం పాఠశాల ల పున ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి చందన నల్గొండజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్న త పాఠశాలలో విద్యార్థులకు యూ నిఫామ్స్ , పుస్తకాలను పంపిణీ చేశారు.బడి ఈడు ఉన్న ప్రతి పిల్లవాడు,అమ్మాయి బడిలో ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమ ని, రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ బడిబాట(Professor Jayashankar Badibata program) పేరున పిల్లలఅందరిని ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయించుకోవడమే కాకుండా, వారికీ అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ తెలిపారు.
నల్గొండ జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సుమారు 2.50 లక్షల దుస్తులను కుట్టించి విద్యా ర్థులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు దుస్తులను, పుస్తకాలను పంపిణీ చేస్తున్నా మని , జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 1800 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగిందని, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కొత్త తరగతి గదులను నిర్మించామని, డైనింగ్ హాలుకు పెయింటింగ్ పనులు రెండు రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని, విద్యార్థులు మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకో వాలని, ఉపాధ్యాయులు సైతం విద్యార్థులలో టాయిలెట్లను శుభ్రంగా ఉంచుకునే విషయంపై అవగాహన కల్పించాలని, మున్సి పాలిటీ ద్వారా అవసరమైన నీటి వసతిని టాయిలెట్లకు (Toilets)కల్పిస్తా మని , ఇవే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడమే ధ్యేయంగా పనిచేయాలని, కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుందని అన్నారు.
ప్రత్యేకించి అమ్మాయిలకు విద్య ఎంతో ముఖ్యమని,ఇంట్లో తల్లి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని అన్నారు. చదువుకోవడం వల్ల ఆర్థిక స్వాతంత్రం వస్తుందని అందువల్ల బాగా కష్టపడి చదవాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు.మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలలో ప్రతిభా వంతులైన ఉపాధ్యాయులు ఉన్నా రని, గతంతో పోలిస్తే ఇప్పుడు పాఠశాలల్లో సౌకర్యాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని, 96% ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉన్నప్పటికీ, నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు.
ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, టాయిలెట్స్, భోజనము, పుస్తకాలు, దుస్తులు, అన్నిటిని కల్పించిందని, ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు ఐఏఎస్,ఐ పి ఎస్ లతో పాటు సమాజంలో మంచి స్థానాలను పొందారని అన్నారు.
జడ్పిటిసి లక్ష్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్ గౌడ్(Municipal Vice Chairman Abbagoni Ramesh Goud), జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, ఎంఈఓ అరుంధతి, స్థానిక కౌన్సిలర్ రైసా వసూమ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Professor Jayashankar Badibata program