Jagan mohan reddy: జనబలముంది జoకొద్దు
మనకు జన బలం ఉంది. జనం కోసం పోరాడుదాం, కేసులకు భయప డొద్దు, ప్రలోభాలకు లొంగొద్దు, దాడుల్లో గాయపడిన కార్యకర్తలకు దైర్యం చెబుదాం. రాష్టంలో పర్య టిస్తా, చంద్రబాబు తప్పులు లెక్క పెడదాం. శిశు పాలుడి లెక్క తేలు తుంది. టీడీపీ జనసేన హానీమూన్ సాగనిద్దాం. అసెంబ్లీలో నోరు నొక్కితే, శాసన మండలిలో స్వరం పెంచుదాం, అని ఎమ్మెల్సీ లకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దిశ నిర్ధేశించారు.
కేసులకు భయపడొద్దు, ప్రలో భాలకు లొంగొద్దు
అసెంబ్లీలో నోరునొక్కితే, శాసన మండలిలో స్వరం పెంచుదాం
ఎమ్మెల్సీ లతో భేటీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దిశా నిర్ధేశo
ప్రజా దీవెన అమరావతి: మనకు జన బలం ఉంది. జనం కోసం పోరాడుదాం, కేసులకు భయప డొద్దు, ప్రలోభాలకు లొంగొద్దు, దాడుల్లో గాయపడిన కార్యకర్తలకు దైర్యం చెబుదాం. రాష్టంలో పర్య టిస్తా, చంద్రబాబు తప్పులు లెక్క పెడదాం. శిశు పాలుడి లెక్క తేలు తుంది. టీడీపీ జనసేన హానీమూన్ సాగనిద్దాం. అసెంబ్లీలో నోరు నొక్కితే, శాసన మండలిలో స్వరం పెంచుదాం, అని ఎమ్మెల్సీ లకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(YSRCP President Jagan mohan reddy) దిశ నిర్ధేశించారు. తాడేపల్లి లోని పార్టీ కార్యాలయం లో గురువారం ఎమ్మెల్సీలతో జగన్ (MLC )భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుం డిపో తుందన్నారు.
40 శాతం ప్రజ లు మన వైపే ఉన్నారు అనేది మరి చిపోవద్దు. మనం చేసిన మం చి ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది. ఎన్ని కలు ఫలితాలు శకునిపాచి కలు మాదిరిగా ఉన్నాయి. ఈవీ ఎంల వ్యవహారాలు దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేనల హనీ మూన్ నడుస్తోంది. మరి కొంత సమయం వారికి ఇద్దాం. శిశుపాలుడు మాదిరిగా చంద్ర బాబు తప్పులను లెక్కించాలి. ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దామ న్నారు. మళ్లీ వైఎస్సార్సీపీ (YSRCP)ఉవ్వె త్తున ఎగిసే రోజులు దగ్గర లోనే ఉన్నాయని. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్య టన చేస్తానని జగన్ వివరించారు. మనపై కేసులు పెట్టినా భయప డొద్దని , 40 శాతం ప్రజలు మన వైపే ఉన్నారని, ఆ విషయం మరిచి పోవద్దన్నారు.
ఎటువంటి ప్రలోభాలకు లొంగ కుండా ప్రజా సమస్యల పై పోరా డాలని, అసెంబ్లీ లో నోరు మెదప కుండా కట్టడి చేసే అవకాశం ఉం దన్నారు. శాసన మండలి లో గట్టిగా పోరాటం చేద్దాం అని జగన్ వివరించారు. ఇప్పటికే ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాలు ఇంకా ఇవ్వ లేదు. రైతుభరోసా, విద్యాదీవెన తదితర పధకాలు ఇంకా ఇవ్వ లేదు. కొంత సమయం ఇచ్చి చూ ద్దాం. ఆ తర్వాత ప్రజల తరు పున పెద్ద ఎత్తున్న పోరాటం చేద్దాం” అని జగన్ స్పష్టం చేశారు. కొత్త ప్రభు త్వం ఏర్పడిన వేళ త్వరలో మం డలి సమావేశాలు ఉండే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల ఫలితా లపైనా చర్చించిన అనంతరం మండలిలో వ్యవహరించాల్సిన వ్యూహాంపైనా చర్చించి ఎమ్మె ల్సీలకు వైఎస్ జగన్ (YS Jagan)దిశానిర్దేశం చేశారు.త్వరలో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని ఎమ్మెల్సీల బేటీలో ఆయన ఆ విషయాన్ని దృవీకరించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వాళ్లను ఆయన పరామర్శిస్తారని తెలు స్తోంది.
Do not fear YSRCP Leaders