Asha Exams: ఆశాలకు పరీక్ష విధానం విరమించుకోవాలి
ఆశా లకు ఎగ్జామ్ పెట్టే ఆలోచనను వెం టనే విరమించుకోవాలని సిఐ టియు జిల్లా అధ్యక్షుడు యూని యన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చిన పాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నల్లగొండ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా
సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదన్న సిఐటియు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆశాలకు ఎగ్జామ్ (Asha worker exams)పెట్టే ఆలోచనను వెం టనే విరమించుకోవాలని సిఐ టియు(CITU) జిల్లా అధ్యక్షుడు యూని యన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చిన పాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించా లని నల్గొండ కలెక్టరేట్ ముందు భా రీ ధర్నా నిర్వహించారు. అనంత రం కలెక్టర్ దాసరి హరిచందనకు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా గిరిజన ప్రాం తాల్లో 19 సంవత్సరాలుగా మైదాన ప్రాంతాల్లో ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్యశాఖ అనుబంధంగా ప్రజ లకు అనేక వైద్య సేవలు అంది స్తున్నారని అన్నారు.
కరోనా కాలంలో కూడా తమ ఆరోగ్యాలను ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవలు అందించాలని అన్నారు.ప్రభుత్వాలు మాత్రం ఆశాలకు వేతనాలు పెంచకుండా వారి సమస్యలు పరిష్కరించ కుండా వారిని ఇబ్బందులకు గురి చేసే ఎగ్జామ్ నిర్వహించడం దేనికని ప్రశ్నించారు. ఈ ఎగ్జామ్ వల్ల ప్రమో షన్ ఇవ్వడం కానీ రెగ్యులర్(Regular) చేస్తా మని కానీ చెప్పకుండా ఎందుకు పెడుతున్నారనీ ప్రశ్నించారు. ఆశాలను తొలగించాలని కుట్ర దాగి ఉందని అన్నారు . ఈప్రభుత్వానికి క్లారిటీ లేకుండా వాళ్ళ జ్ఞాపకశక్తిని ప్రదర్శించడానికి పెట్టే ఎక్సమ్ ఎట్టి పరిస్థితుల్లో రాయబోమని అన్నారు. ప్రజా పాలనని చెప్పే రేవంత్ సర్కార్ ఆశా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.
ఆశా లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ లు, ఎన్నికల ముందర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అదేవిధంగా కనీస వేతనం 26వేలు ఇవ్వాలని జాబ్ చార్ట్ రూపొందించాలని పెండింగ్ బిల్లులు ఇవ్వాలని అర్హత కలిగిన ఆశాలకు ఏఎన్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాలని, 50 లక్షల ప్రమాద బీమా, మట్టి ఖర్చులకు 50వేలు, లెప్రసీ సర్వే ,పల్స్ పోలియో(Pulse Polio), వివిధ ఎలక్షన్ల డ్యూటీలో(Election Duty) డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే ఆలోచన విరమించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి,యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి,టి వెంకటమ్మ, సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు,పోలే సత్యనారాయణ,బైరం దయానంద్ ఆశ యూనియన్ జిల్లా నాయకులు ఆర్ కవిత, బి స్వర్ణ ,వసంత, పార్వతమ్మ, బి.అనూష,ఎస్.కె సలీమా, పుష్పలత,విమల,ఎస్.కె తహర్, సిహెచ్ ధనలక్ష్మి,బి రేణుక, సత్తమ్మ,బి కళావతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Ashas do not want exams