central home minister: కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
సాదాసీదాగా బండి సంజయ్ “హోం” బాధ్యతల స్వీకరణ
ఉదయం11 గంటలకు నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ కుమార్
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్(Union Minister of State for Home Affairs Bandi Sanjay) పదవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతల కార్యక్ర మానికి హాజరై వేద మంత్రో ఖ్చరణ లతో బండి సంజయ్ కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠా ధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీ స్సులు అందించారు. బండి సం జయ్కు పూల బొకే అందించి అభి నందనలు తెలిపిన సహచర మంత్రి నిత్యానంద రాయ్.భద్రతా కారణా ల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నా యకుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు తన అధికారిక నివాసంలో బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ నుండి భారీగా తరలివ చ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్య వాదాలు తెలిపారు.
అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజల రాకతో బండి సం జయ్ నివాసం కోలాహలంగా ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ సహా య మంత్రిగా బండి సంజయ్ కు మార్ బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయ మం త్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. జగద్గురు శంకరా చార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై వేద మంత్రో ఖ్చరణలతో బండి సంజయ్ కు ఆశీస్సులు అందించారు.
ఈ సందర్భం గా సహచర మంత్రి నిత్యానంద రాయ్(Nithyananda Roy) బండి సంజయ్ కు పూలబొకే అందించి అభినం దనలు తెలిపారు.భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయ కుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు తీసుకున్నారు. అంతకు ముందు తన అధికారిక నివాసంలో బండి సంజయ్ (Bandi sanjay kumar)ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ నుండి భారీగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పూలబొకేలు, శాలువాతో సత్కరించి స్వీట్లు అందించి బండి సంజయ్ కు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజల రాకతో బండి సంజయ్ నివాసం కోలాహలంగా మారింది.
Bandi Sanjay took charge as central home minister