Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sheep distribution scheme scam: గొర్రెల కేసులో ఈడి రంగ ప్రవేశం

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం(sheep distribution scheme scam)పై ఈడీ కేసు నమోదు(ED registered case) చేసింది.

ఏసిబి కేసు ఆధారంగా ఈడి దర్యాఫ్తు ప్రారంభం
ప్రజా దీవెన, హైదరాబాద్; తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం(sheep distribution scheme scam)పై ఈడీ కేసు నమోదు(ED registered case) చేసింది. ఏసీబీ కేసు(ACB Case) ఆధారంగా ఈడీ దర్యాఫ్తును ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో అక్రమ నగదు రవాణా జరిగిందని గుర్తించిన ఈడీ అధికారులు పూర్తి వివరాలు కావాలని తెలంగాణ సీఐడీ అధికారులకు లేఖ రాశారు.

గొర్రెల స్కామ్ లో జరిగిన రూ 700 కోట్ల అవినీతి జరిగిందని పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలను తెలంగాణ ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన వివరాలు ఆదారంగా ఈడీ పిఏంఎల్ఏ యాక్ట్ (prevention of money laundering act) కింద గొర్రెల స్కామ్ పై విచారణ చేపట్టాలని నిర్ణయించింది.

గొర్రెల స్కీమ్ కు(sheep distribution scheme scam) సంబంధించిన పూర్తి వివరాలు అందివ్వాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు ఈడీ లేఖరాసింది. జిల్లాల వారీగా లబ్ధి దారుల పేర్లు, వారి అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరా లు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల రవాణాలో కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాలు ఈ కుంభ కోణానికి కార కులు ఎవరు, ఎవరెవరి పాత్ర ఉంది రికార్డ్స్ లో తప్పుడు లెక్కలు వంటి వాటి వివరాలు కూడా కోరింది.

ED registered case in sheep distribution scheme scam