Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Munnuru Kapulu: మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి: కొండా దేవయ్య పటేల్

స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్నూరు కాపు(Munnuru Kapulu ) నాయకుల గెలుపు కోసం చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్(Devayya patel) అన్నారు

ప్రజా దీవెన, కోదాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్నూరు కాపు(Munnuru Kapulu ) నాయకుల గెలుపు కోసం చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్(Devayya patel) అన్నారు గురువారం కోదాడ పట్టణ అధ్యక్షుడు సన్నీరు మురళి ఆధ్వర్యంలో కోదాడమాజీ సర్పంచ్ మున్నూరు కాపు సీనియర్ నాయకులు పార సీతయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో దేవయ్య పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మున్నూరు కాపులు రాజకీయంగా(Political) చైతన్య వంతులు కావాలని ఏ పార్టీలో ఉన్న కీలకమైన వ్యక్తులం మనమేనని మొన్న జరిగిన ఆంధ్ర ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం అదేవిధంగా ముఖ్యమంత్రి గెలుపుకు మున్నూరు కాపులదే లోప్రధాన పాత్ర అని అన్నారు.

మన ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా హుజూర్నగర్ ,కోదాడ సూర్యాపేట, తుంగతుర్తి నాలుగు నియోజకవర్గాల నుండి 12 మంది సభ్యులతో అడక్ కమిటీ ఏర్పాటు చేసుకొని వారి సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవాలని తెలిపారు మున్నూరు కాపు సీనియర్ నాయకులు పారా సీతయ్య మాట్లాడుతూ మున్నూరు కాపు బిడ్డలు నా కుటుంబ సభ్యులు గ్రామస్థాయి నుండి పటిష్టంగా రాష్ట్ర స్థాయికి ఎదగాలని గ్రామాలలో అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసుకొని కలిసికట్టుగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మున్నూరు కాపులను గెలిపించి తమ ఉనికిని చాటి చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోలా నాగేశ్వరరావు ,ఉపేందర్, కోటయ్య , ,శీను, ప్రసాద్ , నాగేశ్వరావు, వెంకటరావు, శేఖర్ , శాహ కేశవులు , గోవిందు, బుజ్జీ మోహన్ నరసింహారావు, సతీష్, వీరన్న వీరాంజనేయుల ధనుంజయ నాయుడు , నాగేశ్వరావు, రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

Munnuru Kapulu grow economically and politically