Modi Italy tour: ఇటలీకి ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటలీకి పయనమయ్యారు. ప్రధాని జార్జి యా మెలోనీ ఆహ్వానం మేరకు ఆ దేశంలో ప్రారంభమైన జీ7 దేశాల వార్షిక సదస్సులో ఆయన పాల్గొన నున్నారు.
జి 7 దేశాల సదస్సులో పాల్గొననున్న ప్రధాని
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటలీకి పయనమయ్యారు. ప్రధాని జార్జి యా మెలోనీ ఆహ్వానం మేరకు ఆ దేశంలో ప్రారంభమైన జీ7 దేశాల వార్షిక సదస్సులో ఆయన పాల్గొన నున్నారు. కేంద్రంలో వరుసగా మూ డోసారి ప్రధానిగా బాధ్యతలు చేప ట్టిన అనంతరం చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. దీనిపై ఆయన హర్షం వ్యక్తంచేస్తూ ఓ ప్రకటన విడు దల చేశారు. జీ7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
ఈ సదస్సులో పాల్గొనే ఇతర నేతలతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇట లీలోని బోర్గో ఎగ్నాజియా ప్రాంతం లోని ఓ లగ్జరీ రిసార్ట్లో జీ7 దేశాల సదస్సు (జూన్ 13-15) ప్రారంభ మైంది. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, ఇమాన్యుయేల్ మెక్రాన్, జపాన్, కెనడా, బ్రిటన్ ప్రధానులు ఫుమియో కిషిదా, జస్టిన్ ట్రూడో, రిషి సునాక్, జర్మనీ ఛాన్స్లర్ ఓలాఫ్ షోల్జ్ తదితర నేతలు ఇప్ప టికే అక్కడికి చేరుకున్నారు. జార్జి యా మెలోనీ వారికి స్వాగతం పలికారు. ఇదిలాఉండగా.. గతేడా ది జపాన్లోని హిరోషిమా వేదికగా జరిగిన జీ7 దేశాల సదస్సుకు మోదీ హాజరైన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇతర ప్రపంచ నేతలతో చర్చలు జరిపారు.
PM Modi reached Italy