Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PhD entrance exam: పీహెచ్డీ ప్రవేశ పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలి

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మొట్ట మొదటి పీహెచ్డీ ప్రవేశ పరీక్షను రేపు నిర్వహించనున్నారు.

ప్రజా దీవెన, నల్లగొండ రూరల్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(Mahatma Gandhi University) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మొట్ట మొదటి పీహెచ్డీ ప్రవేశ పరీక్షను రేపు నిర్వహించనున్నారు. ఈ సందర్భం గా జరిగిన సన్నాహక సమావేశంలో నిర్వాహకులకు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఓ ఎస్ డి ఆచార్య అంజిరెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, సిఓఈ డా ఉపేందర్ రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె అరుణ ప్రియలతో కలిసి పరీక్ష విధి విధానాలను వివరిస్తూ తగు సూచనలు చేశారు.

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(Mahatma Gandhi University) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిం చనున్న ఈ ప్రవేశ పరీక్షను అత్యం త పారదర్శకంగా నిర్వహించా లని కోరారు. రెండు విడతలుగా జరగ నున్న పరీక్షలో ఉదయం 10:30 నుండి 11:30 వరకు అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు రిసర్చ్ మెథడాలజీ పరీక్ష నిర్వహిస్తారు. రెండవ విడత 12:00 నుండి 1:00 వరకు బిజి నెస్ మేనేజ్మెంట్, కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ అభ్యర్థులకు పరీక్ష నిర్వహణ.

అనంతరం 2 గంటల నుండి 3 గంటల వరకు కామర్స్(Commerce),  బయో కెమిస్ట్రీ(Biochemistry ), కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేటిక్స్(Computer Science and Informatics candidates)అభ్య ర్థు లకు , అనంతరం 3:30 నుండి 4:30 వరకు గణిత శాస్త్ర అభ్యర్థు లకు పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 399 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సి ఓ ఈ డా ఉపేందర్ రెడ్డి తెలిపారు. అభ్య ర్థులు తమ హాల్ టికెట్లను విశ్వవి ద్యాలయ వెబ్ సైట్ నుండి పొందా లని తెలిపారు. ఒక్క నిమిషం సమయ నిబంధన ఉన్నందున అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు.

PhD entrance exam conducted transparently