KCR Photo: బొమ్మ ‘ వివాదంలో అధికారుల బలి
తెలంగా ణ పాఠ్య పుస్తకాల్లో ముందుమా టపై నెలకొన్న వివాదం విషయంలో ఇద్దరు అదికారులు బలయ్యారు.
పాఠ్యపుస్తకాల్లో కెసిఆర్ బొమ్మ(KCR Photo) పై తీవ్ర వివాదం
ముందుమాట కనిపించకుండా అ ట్టకు పేజీని అతికించాలని నిర్ణయం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ పాఠ్య పుస్తకాల్లో ముందుమా టపై నెలకొన్న వివాదం విషయంలో ఇద్దరు అదికారులు బలయ్యారు. పాఠ్యపుస్తకాలు మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్(former Chief Minister KCR) కొందరు మంత్రుల చిత్రాలు ఉండడాన్ని సీరియస్ గా పరిగణించిన ప్రభుత్వం చర్యలకు ఉక్రమించింది. అలాగే ముందుమా ట కనిపించకుండా అట్టకు ఆ పేజీని అతికించాలని నిర్ణయించారు. రా ష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముద్రించి న ముందుమాటపై వివాదం తలె త్తిన విషయం తెలిసిందే.
గతంలో రూపొందించిన ముందుమాటను మార్చకుండా అలాగే ఈ ఏడాది ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేయడంతో ఈ వివాదం చెలరే గింది. ముఖ్యంగా ఈ ముందుమా టలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రుల పేర్లు ఉండడంతో గందరగోళం నెలకొంది. ఇందుకు కారకులైన ఇద్దరు అధికారులపై వేటు వేశారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారె డ్డిని(SCERT Director Radha Reddy) అక్కడి నుంచి తప్పిం చి సమగ్ర శిక్ష అసిస్టెంట్ స్టేట్ ప్రాజె క్టు డైరెక్టర్‌గా బదిలీ చేశారు. పాఠ్య పుస్తకాల ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీని వాస చారిని(Director of Services Srinivasa Chary) ఆ బాధ్యత ల నుంచి తప్పించి మోడల్ స్కూల్ కు బదిలీ చేశారు.
ఎస్సీఈఆర్టీ డైరె క్టర్‌గా రమేష్, పాఠ్య పుస్తకాల ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్‌గా రమణకుమార్‌ను నియమించారు. ఈ వివాదాన్ని ముగించడా నికి అధికారులు కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. అందు లో భాగంగా ఒకటి నుంచి పదో తర గతి వరకు గల తెలుగు పాఠ్య పుస్త కాల్లోని ముందుమాట పేజీని తొల గించి ప్రతిజ్ఞ, వందేమాతరం, జన గణమన కనబడేట్టు అట్టకు లోపల అతికించాల్సిందిగా అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులను అధికారు లు ఆదేశించారు. ప్రస్తుతం ఆ దిశ గా పుస్తకాల్లో మార్పులు చేస్తు న్నారు. గురువారమే చాలా జిల్లా ల్లోని పుస్తకాలను వెనక్కి తెప్పిం చుకున్నారు. ఎంఆర్సీలో వాటిని నిల్వ చేయాలని ఆదేశించారు. మళ్లీ శుక్రవారం ముందుమాట పేజీని అట్టకు అతికించాలన్న (రివైజ్డ్) ఆదేశాలను ఇచ్చారు. ముందే ఈ ఆదేశాలను ఇచ్చి ఉంటే పుస్తకాల రవాణా ఖర్చు, శ్రమ మిగిలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుమాట విషయంలో ముందు చూపు లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
KCR Photo disappeared in Text book page