Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Land irregularities: విజి ‘లెన్స్ ‘ చేతిలో అక్రమ చరిత్ర విస్తుపోయే విషయాలు

తెలంగా ణలో గత ప్రభుత్వ హయాంలోని చివరాంతంలో ప్రభుత్వ స్థలాల పరాధీనం తంతు కొనసాగిన వైనం సమాజాన్ని నివ్వెరపర్చిన సందర్భం అందరికీ తెలిసిందే.

ప్రభుత్వానికి 59 జీవో అక్రమాల సమగ్ర దర్యాప్తు నివేదన
గత ప్రభుత్వ హయంలో అడ్డూఅ దుపు లేకుండా ‘ భూ’ అక్రమాలు
హైదరాబాద్ చుట్టూతతో పాటు జిల్లాల్లో జోరుగా క్రమబద్దీకరణలు
‘అధికారం ‘ అండదండలతో అదే పనిగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు
పలుకుబడి కల్గినవారు, అనునా యులు, అయినవారు కోకొల్లలుగా
నకిలీ ధృవీకరణ పత్రాలతో రూ. కోట్ల విలువైన స్థలాలను అప్పనం గా చేజిక్కించుకున్న అక్రమార్కులు
సీఎం రేవంత్ ఆదేశాలతో విజిలె న్స్ లోతైన విచారణ
సమగ్ర నివేదికతో సత్వర చర్యల కు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం

ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగా ణలో గత ప్రభుత్వ హయాంలోని చివరాంతంలో ప్రభుత్వ స్థలాల పరాధీనం తంతు కొనసాగిన వైనం సమాజాన్ని నివ్వెరపర్చిన సందర్భం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యం గా ప్రభుత్వ ఉత్తర్వు 59 ప్రకారం జరిగిన భూముల క్రమబద్ధీకరణ (Regularization of lands)అడ్డూఅదుపు లేకుండా అడ్డగోలు గా జరిపిన తీరు ఔరా అనిపించక మానదు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ముఖ్యంగా అసెం బ్లీ ఎన్నికల సందర్భంలో ఆగమే ఘాల మీద చేపట్టిన ప్రభుత్వ భూ ముల, స్థలాల క్రమబద్ధీకరణ వ్యవ హారం రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే.

సదరు వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశంతో దర్యాప్తు జరిపిన విజిలెన్స్‌ అధికారులు (Vigilance officers) సమగ్ర నివేదిక రూపొందించారు. సదరు నివేదికలో ఒక సర్వే నెంబ రులో ఎంత మందికి క్రమబద్ధీ కరించారు, సదరు భూమి విస్తీర్ణంకు సంబంధించి బహిరంగ మార్కెట్‌లో ఎంత ధర పలుకుతోంది, రిజిస్ట్రేష న్‌ విలువ ఎంత, కబ్జాదారులు చేసు కున్న అక్రమ క్రమబద్ధీకరణ వెనుక ఎవరి హస్తం ఉంది, అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారా, క్రమబద్ధీకరణకు ఉపయోగించిన ధ్రువీకరణ పత్రాలు సరైనవేనా వంటి సమగ్ర వివరాలను విజిలెన్స్‌ అధికారులు ఈ నివేదికలో పొందు పరిచి ప్రభుత్వానికి నివేదించేందు కు సిద్ధమయ్యారు.
అక్రమార్కుల గుండెల్లో గుబు లు.. విజిలెన్స్ సమగ్ర నివేదిక నేప థ్యంలో కబ్జాదారులతో పాటు అక్ర మ క్రమబద్ధీకరణపై వారికి సహక రించిన అధికారుల గుండెల్లో గుబు లు మొదలైంది.

వాస్తవానికి గత ఏ డాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఫలి తాలు వెలువడే రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల క్రమ బద్ధీకరణ (Regularization of lands)భారీ ఎత్తున జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ తోపాటు రాజధాని చుట్టు పక్కల జిల్లాల పరిధిలో ఇది ఎక్కువగా చోటు చేసుకుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంత మంది పెద్దల కనుస న్నల్లో ఇదంతా జరిగిందని ఆరోపణలున్నాయి. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను క్రమబ ద్ధీకరణ పేరుతో దొడ్డిదారిన కబళిం చారన్న విమర్శలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.

దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన విజి లెన్స్ అధికారులు, జీవో 59 కింద జరి గిన భూముల క్రమ బద్ధీకరణ వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ తో సేకరించారు. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రావ డంతో అధికారులు ఎన్నికల విదు ల్లో నిమగ్నo కావడం, ముఖ్యమం త్రి, మంత్రులు కూడా ఎన్నికల ప్రచా రంలో బిజీ బిజీగా ఉండడంతో జీవో 59 క్రమబద్ధీకరణ భూముల వ్యవహారం కొంతకాలంపాటు స్తబ్దుగా ఉంది. కాగా ఇటీవల ఎన్ని కల కోడ్ ముగిసిన నేపథ్యంలో పరి పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం జీవో 59 అక్రమాలపై ఆరా తీసిన ట్లు సత్వర చర్యలకు సిద్ధమవు తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

‘ అధికారం’ పాత్ర పై నిశిత పరిశీలన.. ప్రభుత్వ భూముల ఆక్రమ క్రమబద్ధీకరణ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకు ల పాత్ర ఉందని బహిరంగ విమర్శ లు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆ సందర్భంలో 2023 ఆగస్టు నుంచి డిసెంబరు వరకు జీ వో 59 కింద భారీ ఎత్తున ప్రభుత్వ భూముల ఆక్రమ క్రమబద్ధీకరణ జరిగిందని అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ తో పాటు జిల్లాలో ని పెద్ద ఎత్తున క్రమబద్ధీకరణలు

ఫక్తు ప్రభుత్వ భూమి అయినప్ప టికీ మార్కెట్ లో గజం లక్ష కు పైగా ధర పలికే హైదరాబాద్ శివారు ప్రాం తాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నల్లగొండ పాత జిల్లాల్లో స్థలాల క్రమబద్ధీకరణ పర్వం మూడు పూలు,ఆరు కాయ లుగా కొనసాగింది. రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లోను జీవోను అ డ్డు పెట్టుకొని భారీ అక్రమాలకు పా ల్పడ్డారు. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల ఇళ్లలో పనిచేసేవారు, డ్రైవర్లు, కార్యకర్త లు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో సహా పలుకుబడి కలిగిన ఇతర అనేక వర్గాలకు క్రమబద్ధీకరణ చే యించారు.

విచిత్రమేమిటంటే ఖాళీ ప్రభుత్వ భూముల్లో అది కూడా ని వాస గృహాలు లేని ప్రాంతాల్లో వీరం దరూ పక్కా ప్రణాళికతో అక్రమదా రులు తమకు ఇళ్లు లేకపోయినా దరఖాస్తులు చేసుకొని క్రమబద్ధీ కరించుకున్నారు. గతంలో కూల్చిన ఇళ్ల మొండి గోడలకు ఇంటి నెంబ ర్లు, కరెంట్ బిల్లులు అప్పటికప్పుడు సృష్టించి మరి కొందరు ఒకే ఇంటి నెంబరు పై, ఒకే కరెంటు బిల్లుపై అనేక దరఖాస్తులు చేసి అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారు. క్రమబ ద్ధీకరించిన స్థలాలను కొందరు మరు సటి రోజే విక్రయించారు. వీటన్నింటి పైనా ఇప్పటికే దర్యాప్తు కోనసాగిం ది, సాగుతోంది. కాగా విజిలెన్స్ దర్యాప్తులు వెలుగు చూసిన అంశాలన్నీటిని పరిగణలోకి తీసుకొని అక్రమార్కులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

Vigilance on Land irregularities