Komati Reddy Venkata Reddy: ప్రజలు సుభిక్షంగా ఉండాలి
Komati Reddy Venkata Reddy:-రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
–రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్రజలు, నల్గొండ జిల్లా (NALGONDA) ప్రజలు సుభిక్షంగా ఉండేలా నల్లగొండ జిల్లా ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి(RENUKA DEVI) ఆశీర్వదిం చాలని, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి (Komati Reddy Venkata Reddy) ఆకాంక్షిం చారు. ఆదివారం నల్ల గొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశి పురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కల్యా ణోత్స వానికి ఆయన సతీమణి శ్రీమతి సబిత తో కలిసి జమదగ్ని సమేత రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణా నికి తెలంగాణ (TELANGANA) రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతే కాక ప్రత్యేక పూజలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు,ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రి దంపతు లకు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. కనగల్ మం డలం దరవేశి పురం రేణుక ఎల్లమ్మ అమ్మవారి వార్షిక బ్రహ్మో త్సవాలలో భాగంగా ఆదివారం కళ్యాణం నిర్వహించగా మంత్రి దంపతులు హాజరై కల్యా ణం జరిపించారు. కళ్యాణోత్స వాని కి హాజరైన భక్తులందరికీ (DEVOTEES) మంత్రి ఉచిత అన్నదానం జరిపించారు.ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komati Reddy Venkata Reddy) మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రజలు,రాష్ట్ర ప్రజలు సుభి క్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి ప్రజలు పాడి,పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించి నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాను అన్ని రంగాలలో తెలం గాణ రాష్ట్రంలోనే ముందు స్థానం లో ఉంచేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.ఈ కళ్యాణ మహోత్సవానికి ఈవో జల్లపల్లి జయరామయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ నగేష్, ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమార్ చారి,దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి తదితరులు హాజరయ్యారు.