NEET-KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జూన్ 4 వతేదీన నీట్ యూజీ 2024 (NEET) ఫలితా లను ప్రకటించిన విషయం తెలిసిం దే. ఈ ఫలితాల్లో దాదాపు 67 మం ది విద్యార్థులకు టాప్ ర్యాంకు వచ్చింది. వీరందరికీ 99.997129 పర్సంటెల్ వచ్చింది. ఎంతో కఠిన మైన నీట్ పరీక్షలో (NEET) ఇంత మందికి ఒకే పర్సెంటైల్ రావడం దేశ వ్యా ప్తంగా సంచలనంగా మారింది. దీంతో నీట్ యూజీ-2024 పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణ లు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు ఈ విషయంపై ఆందోళనలు చేపడు తున్నాయి.
అయితే తాజాగా నీటి (NEET) యూజీ పరీక్షల్లో చోటుచేసుకున్న పరిణమాలపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ ఆదివా రం బహిరంగ లేఖ రాశారు. నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై కేటీఆర్ మండి పడ్డా రు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓవైపు గ్రేస్ మార్కు ల గందరగోళం మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదం డ్రుల్లో ఆందోళన చెందుతున్నారని అన్నారు.పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు నీట్ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేశారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలని.. వెంటనే బాధ్యులను శిక్షించాలని కోరారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కేటీఆర్ (KTR)డిమాండ్ చేశారు.