–శాలిగౌరారం చెరువు నుండి విడుదల చేసిన ఎంపీ చామల, ఎమ్మె ల్యే మందుల
Mousse water :ప్రజా దీవెన, శాలిగౌరారం: మూసీ ఆయకట్టు రైతుల కోసం తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం చెరువు నుండి నీటిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే (mla) మందుల సామేలు విడు దల చేశారు. అంతకు ముందు గంగమ్మ తల్లికి వేద పండితులతో పూజలు నిర్వహించి గంగాదేవి (ganaga devi) కి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడు తూ మూసీ నీటి ద్వారా శాలిగౌరారం (Shaligouraram) మండల పరిధిలోని 9 తొమ్మిది గ్రామాలలో సుమారుగా 5 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుం దని అన్నారు.
ఇరిగేషన్ అధికారులు గతంలో పూర్తికాకుండా పెండిం గ్ లో ఉన్న పనులను పూర్తి చేయా లని సూచించారు. ప్రతి నీటి బొట్టు ను ఒడిసిపట్టి వృధా కాకుండా రైతు లకు సాగు చేసుకునే విధంగా అం దించాలని సూచించారు. గతంలో కాంట్రాక్టర్లు చేసిన తప్పిదాలను సరి చేయాలని అన్నారు. పార్లమెంట్ (Parliament) ఎన్నికలలో ఏడు నియోజకవర్గా లలో అత్యధికంగా 73 వేల మెజా రిటీతో తుంగతుర్తి ప్రజలు నన్ను ఆశీర్వదించారు. తుంగతుర్తి ప్రజ లకు రుణపడి ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే సామేలు తో సమన్వ యంతో పనిచేసి నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.