Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pseudo Naxals: సూడో నక్సల్స్ అరెస్ట్

Pseudo Naxals

గుడిలో తుపాకులు దాచిన సూడో నక్సల్స్
బెధిరించి సొమ్ము చేసుకోవాలన్నారు
ప్లాన్ బెడిసి కొట్టి పోలీసులకు చిక్కిన వైనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ చందనా దీప్తీ

Pseudo Naxals: ప్రజాదీవెన, నల్లగొండ: ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వైజాగ్ (VIZAG) నుంచి తుపాకులు (GUNS) కొనుగోలు చేశారు. బిగ్ షాట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్‌గా బెదిరించి సొమ్ము చేసుకోవాలని భావించారు. చివరికి సీన్ రివర్స్ అయింది. సూడో నక్సల్స్ అవతారమెత్తిన ఈ కేటుగాళ్లు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం గణపురంకు చెందిన తోటకూరి శేఖర్ ఓ కేసులో జైలు పాలయ్యాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపల్లికి చెందిన రమేష్ మిర్యాలగూడ జైల్లో (JAIL) శేఖర్ కు పరిచయమయ్యాడు. జైలు (JAIL) నుంచి బయటకు వచ్చాక ఈజీగా మనీ సంపాదించి జీవితంలో స్థిరపడాలని ఇద్దరూ పథకం వేశారు. ఇందులో భాగంగా రమేశ్ కు తెలిసిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మీ నారాయణ, శ్రీనివానులు కలిసి సూడో నక్సలైట్ (NAXALS) ముఠాగా ఏర్పడ్డారు. తుపాకులతో బిగ్ షాట్స్, మైనింగ్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రోడ్డుపై వెళ్ళే వాహనాలు ఆపి తుపాకులు చూపి భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశారు. ఇందు కోసం వైజాగ్ లోని జీకే వీధి సాపర్ల ప్రాంతాల్లో మూడు తుపాకులను కొనుగోలు చేశారు. తుపాకులను కొన్ని రోజులు శేఖర్ తన ఇంట్లో దాచాడు. తుపాకులను ఎవరైనా చూస్తారని భయపడి జనసంచారం లేని గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి గుడిలో మూడు తుపాకులను భద్రపరిచాడు. మే నెల 28వ తేదీన పెద్దమ్మ తల్లి టెంపుల్ ను శుభ్రం చేసేందుకు వెళ్లిన పూజారికి గుళ్లో దాచిన తుపాకులు కంటపడ్డాయి. పూజారి ఇచ్చిన సమాచారంతో పోలీసులు మూడు తుపాకులను (GUNS) స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. దీంతో అసలు భాగోతం బయటపడింది.

ఈ క్రమంలోనే పీఏ పల్లి మండలం అంగడిపేట వద్ద పోలీసులు (POLICE) తనిఖీ చేస్తుండగా ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న శేఖర్ ను అదుపులోకి తీసుకొని విచారించడంతో సూడో నక్సల్స్ ముఠా గుట్టు రట్టయింది. తుపాకులు పెద్దవిగా ఉండడంతో బెదిరించడానికి ఇబ్బందిగా ఉందని భావించి పిస్టల్ కోసం ఈ ముఠా ప్రయత్నించింది. ఈ క్రమంలో శేఖర్ ఇచ్చిన సమాచారంతో మిగిలిన ముగ్గురు నిందితులను కూడా హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు (ARREST) చేశారు. శేఖర్, రమేష్ లపై ఇప్పటికే కొన్ని కేసులు కూడా ఉన్నాయని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఏవరైనా ఇలాంటి అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం నేరమని, అక్రమ ఆయుధాలతో ఎవరైనా బ బెదిరిపులకు పాల్పడితే సహించేది లేదని ఆమె తేల్చి చెప్పారు.