–పత్రికలపరంగా ప్రజలకు చేరువ కావడంలో ఆయనకాయనే సాటి
–తెలుగును ప్రేమించి, అభిమానిం చి, పోషించిన వ్యక్తి రామోజీరావు
–పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలిలో పలువురు వక్తలు
Ramoji: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు రావడానికి కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని వక్తలు కొనియాడారు. ఆయన నికార్సయిన జర్నలిస్టు (journalist) అన్నారు. క్రమశిక్షణ, సమయపాలనకు పెట్టిం ది పేరని, తెలుగును ప్రేమించి, అభిమా నించి, పోషించిన వ్యక్తి అని ప్రశంసించారు. ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయ శిఖరం రామోజీరావుకు (ramajo rao) అక్షరాంజలి పేరుతో ఈనాడు సంస్థ ల దివంగత చైర్మన్ రామోజీరావు సంతాప సభ జరిగింది. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, విజయనగరం ఎంపీ కె.అప్పలనాయుడు, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, వీఎస్‌ఆర్ శాస్త్రి, డీఎన్ ప్రసాద్, ఎం.నాగేశ్వరరావు, టి.కృష్ణమూర్తి, కార్టూనిస్ట్ శ్రీధర్, జైపాల్‌రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, సీనియర్ పాత్రికేయులు.. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు తమ అనుభవాలను పంచుకున్నారు.
తెలుగు జర్నలిజానికి (telugu journalism) పేరు రావడానికి ఆద్యుడు రామోజీరావు అని కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన నిత్య కృషీవలుడు అని చెప్పారు. రామోజీరావు (ramajo rao) తెలుగు జర్నలిజాన్ని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లారని.. పత్రిక భాషను ప్రజల, వాడుక భాషగా మార్చారని అల్లం నారాయణ అన్నారు. ఈనాడులో పరీక్ష రాస్తే ఎంపిక కాలేదని.. అయినా రోజూ కార్యాలయానికి వెళ్లే వాడినని, చివరికి స్ట్రింగర్‌గా చేరి రామోజీరావు చేతుల మీదుగా అవార్డు తీసుకున్నానని విజయనగరం ఎంపీ కె.అప్పలనాయుడు చెప్పారు. రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కె.రామచంద్రమూర్తి (K. Ramachandramurthy) కొనియాడారు. తెల్లవారు జామున 4 గంటలకే ఆయన దినచర్య ప్రారంభమమై రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా కొనసాగేదని, రామోజీ (ramoji) జీవితంలో కొన్ని నేర్చుకుని, పాటించినా మంచి విజయాలు సాధించవచ్చని ఎం.నాగేశ్వరరావు అన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు వ్యవస్థ, వటవృక్షం, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఈటీవీలో పనిచేసిన వ్యాఖ్యాతలు, న్యూస్ రీడర్లు అన్నారు. ఇదిలా ఉండగా కష్టమొచ్చినా, నష్టమొ చ్చినా రాజీ పడని వ్యక్తిత్వం రామోజీరావుదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రామోజీ ఫిలింసిటీలో ఆదివారం శైలజాకి రణ్‌తో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. రామోజీరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఈటల మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్నప్పుడు కూడా రామోజీరావు ఒక్కమాట నెగెటివ్‌గా మాట్లాడలేదన్నారు.