–ప్రియుడి చేతిలో ప్రియురాలి దారుణ హత్య
–విచారణ ముమ్మరం చేసిన పోలీసులు
–భాగ్యనగరం పాతబస్తీలో సంఘటన
MURDER: ప్రజాదీవెన, హైదరాబాద్: ఇది వరకే వివాహం జరిగి విడాకులైన మహిళతో (woman) ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న ప్రియుడే అనుమానంతో ప్రియురాలిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ (Police station) పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాతబస్తీ ఛత్రినాకకు చెందిన శ్రావ్య (32)కు ఇది వరకే ఓ వ్యక్తితో 2019లో వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకోవడంతో విడాకులు సైతం తీసుకున్నట్లు సమాచారం. దీంతో తల్లి వద్దనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
గౌలిపురకు చెందిన మణికంఠ, శ్రావ్యలు చిన్ననాటి స్నేహితులు. భర్తతో విడాకుల (Divorce) అనంతరం శ్రావ్యతో మణికంఠకు మధ్య సన్నిహత్యం పెరిగింది. అది కాస్త ముదిరి ప్రేమగా మారింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా గత కొన్ని రోజులుగా శ్రావ్య మణికంఠతో దూరంగా ఉంటుంది. దాన్ని తట్టుకోలేకపోయిన మణికంఠ ప్రియురాలు మరొకరితోను ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అనుమానం కలిగింది. ప్రియురాలు దూరం పెట్టడం, ఆమెపై పెరిగిన అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. “ఇంతకు ముందుకే ఆమెకి పెళ్లి (MARRIAGE) అయిపోయింది.
అతనితో విడాకులు (Divorce) అయ్యాయి. మళ్లీ ఇతన్ని ప్రేమించింది. సడెన్‌గా ఆయన ప్రేమను ఆమె నిరాకరించింది. అతను వచ్చి డోర్ పెట్టేసి కత్తి పీటతోని ఆమెపైన కూర్చోని గొంతు కోసి, కళ్లపై పొడవటం జరిగింది. మాకు చప్పుడు వస్తే వెళ్లాం. కిటీకిలు పగలకొట్టి చూస్తే ఇలా అయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాము.” అని ఇంటి యజమాని దీపక్ చెప్పారు. మంగళవారం ఉదయం శ్రావ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి మణికంఠ ఆమెతో గొడవకు దిగాడు. వారి మధ్య మాటమాటా పెరగడంతో ఇంట్లోని కత్తి పీఠతో గొంతు కోయడంతో పాటు ముఖం పై దాడి చేశాడు. శ్రావ్య వాళ్ల ఇంటి నుంచి అరుపులు రావడంతో స్థానికులు వెళ్లి చూశారు. రక్తపుమడుగులలో ఉన్న శ్రావ్యను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు (CASE) చేసి దర్యాప్తు చేపట్టారు.