–ఆరోగ్య తెలంగాణ లో యోగాలు ప్రముఖ పాత్
— వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
Damodar Rajanarsimha: ప్రజాదీవెన, హైదరాబాద్: ఆరోగ్యకర తెలంగాణ నిర్మాణంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha)అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో కర్టెన్‌రైజర్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీఎన్ఎంసీ, జేఎస్పీఎస్ కళాశాల విద్యార్థులతో కలిసి పీపుల్స్ ప్లాజా వరకు వాకింగ్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులు యోగాసనాలు ప్రదర్శించారు. వారిని దామోదర రాజనర్సింహ అభినందించారు. జూన్ 21వ తేదీన ప్రతి తెలంగాణవాసి (TELAGANA) యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.