Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

White Jamun: వాటర్‌ యాపిల్స్‌ గురించి తెలుసా మీకు.. వీటిని తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో..

White Jamun: చిన్నపిల్లవాడి నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా యాపిల్స్ అంటే బాగా ఇష్టపడుతూనే ఉంటారు. ఇకపోతే యాపిల్స్ లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వాటర్ యాపిల్స్ (water apples) రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఇక ఈ వాటర్ యాపిల్స్ (water apples) మనకు నలుపు, తెలుపు, ఎరుపు రంగులలో మార్కెట్లో లభిస్తాయి. ఇక మార్కెట్లో ఈ వాటర్ ఆపిల్స్ ను ‘వైట్ జామెంట్’ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ పండల్లో పోషకాలు చాలా పుష్పగలంగా లభించడంతో అందరూ ఇష్టపడతారు. సాధారణంగా నేరేడు పండ్ల ప్రయోజనాల గురించి అందరికి తెలుసు. కానీ., వాటర్ యాపిల్స్ (water apples) ప్రయోజనాలు (benifits) తెలుస్తే ఎక్కువగా ఇవే ఇష్టపడతారు.

ఇక ఈ వాటర్ యాపిల్స్ (water apples) ఎక్కువగా ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాలలో సాగు చేయడం మనం గమనించవచ్చు. ఈ వాటర్ యాపిల్స్ (water apples) రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. నిపుణులు తెలిపిన వాటి ఆధారంగా వాటర్ యాపిల్స్ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా (Hydrate)ఉండడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచి చర్మాన్ని అందంగా ఉంచుతుంది. ఇక ఈ వాటర్ యాపిల్స్ లలో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా రక్తంలో ఉండే చక్కర స్థాయిలను నియంత్రించడంలో కూడా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా షుగర్ (diabetics)వ్యాధితో బాధపడుతున్న వారు రెగ్యులర్గా ఈ వాటర్ ఆపిల్స్ ను తీసుకుంటే మాత్రం వారి షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇక ఈ వాటర్ ఆపిల్స్ ను సమ్మర్ సీజన్ (summer)లో తీసుకోవడం వల్ల సన్ స్ట్రోక్ ను (sun stroke) బయటపడవచ్చు. ఇక అధిక బరువుతో బాధపడే వారు కూడా ఈ వాటర్ ఆపిల్స్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ లో కూడా సహాయపడుతుంది. ఇలాంటి ప్రయోజనాలతో పాటు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.ఈ పండ్లలో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతో.. ఈ పండును క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ (digestion) బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా అపానవాయువు, అజీర్ణం తగ్గుతుంది