–నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నా కఠినంగా వ్యవహరించాల్సిందే
–వైద్యుడైతే మోసగాడు అయితే సమాజానికి పెను హానికరం
–నీట్ అక్రమాల కేసులో ఎన్‌టీఏ, కేంద్రం ప్రభుత్వంపై సుప్రీం కీలక వ్యాఖ్య
NEET: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన నీట్ (NEET) అక్రమాల పై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు (Supreme Court)తీవ్రస్థాయిలో మండిపడింది. నీట్ పరీక్ష (NEET) నిర్వ హణలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్న ఉపేక్షించే పరిస్థితి లేదని వ్యాఖ్యా నించింది. పరీక్ష నిర్వహణ నిర్లక్ష్యం పై కఠినoగా వ్యవహరించాల్సిం దేనని, తప్పు జరిగితే ఒప్పుకొని చక్కదిద్దాల్సిందేనని సుప్రీంకోర్టు హితవు పలికింది. అప్పుడే నీట్‌పై ప్రజల్లో మళ్లీ విశ్వాసం నెలకొంటుం దని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తం గా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు పడే శ్రమను పరిగ ణనలోకి తీసుకుని నిర్లక్ష్యానికి తా వు లేకుండా నిర్వహించాలని కేంద్రానికి, ఎన్‌టీఏకి సూచించింది.
నీట్ (NEET) అక్రమాలపై దాఖలైన తాజా రిట్ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్ (Justice Vikramnath), జస్టి స్ ఎస్వీ భట్టితో కూడిన వెకేషన్ బెంచ్ మంగ నీట్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆప్ నేతలు సంజయ్ సింగ్, గోపాల్ రాయ్ తదితరుల నిరసన ప్రదర్శన విచారణకు స్వీకరించింది. అయితే నీట్‌పై (NEET) గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి దీన్ని కూడా జూలై 8నే విచారిస్తామని వెల్లడించింది. వ్యవస్థను మోసం చేయడం ద్వారా ఒక వ్యక్తి డాక్టర్ అయితే ఎలా ఉం టుందో ఊహించండి, ఆ వ్యక్తి సమాజానికి మరింత హానికరమో పరీక్ష నిర్వహించే బాధ్యత కలిగిన ఏజెన్సీ నమ్మకంగా, న్యాయంగా వ్యవహరించాలని జస్టిస్ భట్టి వ్యాఖ్యానించారు. నీట్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు పడే కష్టం అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తుచేశారు. పరీక్షలు నిర్వహించే వ్యవస్థకు ప్రతినిధిగా మీరు దృఢ మైన వైఖరి తీసుకోవాల్సిన అవ సరం ఉందని, ఏదైనా తప్పు జరిగి ఉంటే అవును, ఈ తప్పు జరిగింది. దీనిపై మేం ఈ చర్య తీసుకోబోతు న్నాం’ అని చెప్పాలో కదా కనీసం అప్పుడైనా మీ పనితీరుపై విశ్వాసం కలుగుతుందని అన్నారు. ఎంతో పోటీ నెలకొని ఉన్న ఈ పరీక్షల కో సం విద్యార్థులు ఎంత శ్రమ పడ తారో మనందరికీ తెలుసనని ఎన్ టీఏ తరఫు న్యాయవాదిని ఉద్దే శించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. నుంచి దీనిపై సకాలంలో చర్యలు ఆశిస్తున్నామని పేర్కొంటూ ఈ పిటిషన్‌పై రెండు వారాల్లో స్పందన తెలపాల్సిందిగా ఏన్‌టీఏకి (NTA), కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది.