Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్

WhatsApp: దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) నిత్యం నయా ఫీచర్లను వినియోగదారుల కోసం అందజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాయిస్ నోట్స్ (voice notes) ను టెక్స్ట్ రూపంలో మార్చుకునేలా ఓ సరికొత్త ఫీచర్‌ను (new featutre)అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమయ్యింది. ఈ కొత్త ఫీచర్‌ను ట్రాన్‌స్క్రైబ్ అని పిలుస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు వస్తే.. ఈ అప్‌కమింగ్ ఇతరులు పంపించే వాయిస్ నోట్‌ను వర్డ్ బై వర్డ్ టెక్స్ట్ (Word by word text), సెంటెన్స్ బై సెంటెన్స్ (Sentence by sentence) రూపంలో అందిస్తుంది. మామూలుగా వాట్సాప్ లో (WhatsApp) లాంగ్ టెక్స్ట్ ను టైప్ చేయవలసిన అవసరం లేకుండా టెక్స్ట్ ను వాయిస్ నోట్స్ ద్వారా పంచుకోవచ్చు. అయితే ఈ అప్‌డేట్ పంపే వాళ్లకు చాలా ఈజీగా అనిపించినా రిసీవర్ కు అందులో కంటెంట్ ను వెంటనే అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది.

అంతేకాకుండా అందులో పంపిన సమాచారం కోసం ఆ ఆడియో క్లిప్ (audio clip) ను పదేపదే వినాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనిపెడుతూ వాయిస్ నోట్ (voice notes) ను టెక్స్ట్ గా మార్చుకోవడానికి, వాటిని ఈజీగా అర్థం చేసుకోవడానికి కొత్త ఫీచర్ ను డెవలప్ చేస్తున్నారు. ఇక ఈ ఫీచర్‌తో వాయిస్ నోట్‌లో ఏముందో టెక్స్ట్ రూపంలో మార్చుకోగలం, అప్పుడు కంటెంట్ (content) చాలా క్లియర్ గా వినియోగదారులకు అర్థం అవుతుంది. ఈ టెక్స్ట్ ను హిందీ లాంటి అనేక భాషలలో కూడా ట్రాన్స్‌లేట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.

ఇక అంతేకాకుండా వాట్సాప్ (WhatsApp) లో వివిధ భాషల వాయిస్ ని అవసరం టెక్స్ట్ గా మార్చడమే కాకుండా భాషను సెలెక్ట్ చేసుకున్న అనంతరం డేటా ప్యాకేజ్ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.. ఇక అందులో ఉండే డేటాను ఏదైనా వాయిస్ నోట్ (voice notes) పై టైప్ చేసి చేంజ్ టు టెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయగా వాయిస్ నోట్ కాస్త టెక్స్ట్ గా మారిపోతుంది. ఇక ఈ డేటాను మనకు కావాల్సిన భాషలో కూడా ట్రాన్స్‌లేట్ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది వాట్సాప్. ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియ రాలేదు. కానీ ఒక్కసారి ఈ ఫీచర్ (feature) అందుబాటులోకి వస్తే మాత్రం చాలా ప్రయోజనాలు కలుగుతాయి.