Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rahul Gandhi: రాహుల్‌ వారసత్వం త్యాగం

–రాహుల్‌గాంధీకి సీఎం రేవంత్‌ జన్మదిన శుభాకాంక్షలు
–గాంధీభవన్‌లో మంత్రి కోమటి రెడ్డి రక్తదానం
–గాంధీభవన్‌లో ఘనంగా జన్మదిన వేడుకలు
–హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Rahul Gandhi: ప్రజా దీవెన, హైదరాబాద్‌ : దేశంలో అన్ని రకాల అసమానతలతో పోరా డటం ఆయన వ్యక్తిత్వం,వెనుకబడిన వారికి అండగా ఉండాలన్నది ఆయన దృక్పథం, త్యాగం ఆయన వారసత్వం, పోరాటం ఆయన త త్వం,రేపటి కోసం భారతదేశ ఆకాం క్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అని సీఎం రేవంత్‌రెడ్డి (REVANTH REDDY) కొనియాడారు. ఆయనకు హృద యపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌గాంధీ (Rahul Gandhi) జన్మదినం సందర్భంగా బుధవారం ‘ఎక్స్‌’ లో ఈమేరకు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు గాంధీభవన్‌లో (GANDHI BHAVAN) బుధవా రం ఘనంగా జరిగాయి. ఈ వేడు కల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy), ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రారంభించారు. ఈ శిబిరంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Komati Reddy Venkat Reddy), యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి రక్తదానం చేశారు. వారితో పాటు 300 మందికిపైగా తమ రక్తాన్ని దానం చేశారని శివసేనారెడ్డి వెల్లడించారు. రాహుల్‌ జన్మదినం సందర్భంగా ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు కేక్‌ను కట్‌ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉండగా న్యూఢిల్లీ లో జరిగిన రా హుల్‌గాంధీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంపీ వి. హను మంతరావు, మాజీ ఎమ్మెల్యే సంప త్‌కుమార్‌ తదితరులు కేక్‌ కట్‌ చేసి రాహుల్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పొన్నం ప్రభాకర్‌, వీహెచ్‌, మధుయాష్కీ, వంశీచంద్‌రెడి, సంపత్‌కుమార్‌ తదితరులు రాహుల్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు