Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kaleswaram: కాళేశ్వరం ఎస్ఐ భర్తరఫ్

–సర్వీస్ నుంచి తొలగించిన ప్రభు త్వం
–తుపాకీతో బెదిరించి అత్యాచా రం, ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు
–గతంలోనూ ఓ యువతికి ఎస్పై వేధింపులు
–విచారణలో ఆరోపణలు తేటతెల్ల o కావడంత సీఎం రేవంత్ సీరియ స్

Kaleswaram: ప్రజా దీవెన, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలతో రెండేళ్ల క్రితం వేటు పడ్డా ఆ పోలీసు అధికారి (police officer) బుద్ధి తెచ్చుకోలేదు. గతంలో పోలీసు ఉద్యోగానికి సిద్ధమవు తున్న ఓ యువతిపై లైంగిక వేధిం పులకు పాల్పడి సస్పెండైనా పద్ధతి మార్చుకోని ఆ అధికారి కొన్నాళ్లుగా సహచర ఉద్యోగినిపైనే కన్నేశాడు. లైంగిక వేధింపులకు (For sexual harassment) పాల్పడి. చివ రకు పోలీసు క్వార్టర్స్లోని ఆమె నివాసంలోకి చొరబడి, తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్ప డ్డాడు. వివాదాస్పద ఎస్పై, భూ పాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం స్టేషన్లో పనిచేస్తున్న భవానీసేన్ గౌడ్ నిర్వాకమే ఇది. బాధితురాలు పిర్యాదు చేయడంతో అయ్యగారి దుశ్చేష్టలన్నీ విచారణలో తేలాయి. తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం (state government) అతడిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన ఎస్సైగా పనిచేస్తున్న రోజుల్లోనే భవానీసేన్ గౌడ్ వార్తల్లో నిలిచాడు. అప్పట్లో.. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతికి చదువుకునేందుకు పుస్తకాలిస్తానని మభ్యపెట్టి పోలీస్ స్టేషన్కు రప్పించుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 2022 జూలై 12న జరిగిన ఈ ఘటనను ‘ఆంధ్రజ్యోతి’ ప్రముఖంగా ప్రచురించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

అప్పట్లో భవానీ సేన్ నిర్వాకం విచారణలో బయటపడటంతో అధికారులు అతడిని సస్పెండ్ (suspend) చేశారు. అయితే ఉన్నతాధికారులతో తనకున్న పరిచయాలతో మూడు నెలల్లోనే అతడు పోస్టింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చి ఎస్పీకి అటాచ్గా ఉన్నాడు. మళ్లీ పలుకుబడిని ఉపయోగించి కాళేశ్వరం స్టేషన్లో ఎస్సైగా పోస్టింగ్ తెచ్చుకున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్పై కన్నేసిన భవానీసేన్ గౌడ్, నెల రోజులుగా ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. పోలీస్ క్వార్టర్స్లోని వేర్వేరు అంతస్తుల్లో ఎస్పై భవానీసేన్ గౌడ్, మహిళా హెడ్ కానిస్టేబుల్ ఉంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. గత నెలలో బాధితురాలికి భవానీసేన్ ఫోన్ చేశాడు. తాను కాలు జారి పడ్డానని,గాయమైందని, తన గదికి రావాలని చెప్పాడు. బాధితురాలు.. ఆయన గదికి వెళ్లగా, ఆమె పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఆందోళనకుగురైన బాధితురాలు అతడిని తోసేసి, తన గదిలోకి వెళ్లిపోయింది. ఈనెల 16న అర్ధరాత్రి ఒంటిగంటకు క్వార్టర్స్ ని తన నివాసంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ (Female Head Constable) నిద్రిస్తుండగా భవానీసేన్ కిటికీలోంచి దూరాడు.

అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో తన దగ్గర ఉన్న తుపాకీని గురిపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఇంట్లోంచి వెళు తూ.. విషయం బయటికి చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. ఈ గట్టిగా ఘటన పై బాధితురాలు ఎస్పీ కిరణ్్భరు ఫిర్యాదు (cpmpaliant) చేసింది. ఆయన బుధవారం భూపాలపల్లి డీఎస్పీ సంపర్రావు, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డిలతో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో విచారించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఎసై ఆగడాలు వాస్తవమేనని తేల్చారు. స్థానిక సిబ్బంది వాంగ్మూలాలను కూడా రికార్డు చేసి భవాని సేన్పై 449, 376(2) 324,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని, భవానీసేన్ను వైద్య పరీక్షల కోసం భూపాలపల్లి ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో ఉండగా అతడు పారిపోయేందుకు యత్నించాడు.. భూపాలపల్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం భవాని సేన్ గౌడ్ను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు.

ఘటనపై సీఎం రేవంత్ సీరియస్

కాళేశ్వరం పోలీసు క్వార్టర్స్లో మహిళా హెడ్ కానిస్టేబుల్పై అత్యాచారం ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (cm revanth) సీరియస్ అయ్యారు. ఎస్పై భవాని సేన్ గౌడ్పై ఆరోపణలు వాస్తవం అని విచారణ బృందం తేల్చడంతో, అతడిని ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించారు. ఆ మేరకు భవానీసేన్ను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలీసు శాఖకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించే సిబ్బందిని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని, అవసరమైతే సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేందుకూ వెనుకాడబోమని డీజీపీ రవి గుప్తా హెచ్చరించారు. అధికారుల్లో ఒకరిద్దరి తీరు కారణంగా మొత్తంగా పోలీసు శాఖకే చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. సిబ్బంది పనితీరు, వ్యక్తిగత వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.