Tamil Nadu: ప్రజా దీవెన, తమిళనాడు: తమిళ నాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi)జిల్లా లో కల్తీ సారా (Hooch Tragedy)తాగిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరుణాపురంలో నాటుసారా ఘటనలో శుక్రవారం వరకు మృతి చెందిన వారి సంఖ్య 49కు చేరు కుందని తమిళనాడు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంగుమణి (Director Sangumani) పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సుమారు 112 మంది బాధితులు జిల్లాలోని వేర్వే రు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసు కుంటున్నారు. వారిలో మరో 51 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక కల్తీ సారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు ఫెయిల్ అవుతుండటంతో నిపుణులైన వైద్యు లను తమినాడు సర్కార్ రంగంలోకి దించింది. ఇదిలా ఉండగా విళు పురం, సేలం తిరుచ్చి, తిరువణ్ణా మలై జిల్లాల్లోని వైద్య కళాశాలల వైద్యులను (Doctors of medical colleges)తరలించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే, మరోవైపు కళ్లకురిచ్చి ఘటనకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నల్లదు స్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో (Assembly premises) నిరనసలు తెలిపారు. ఇక, నిరసన తెలిసన ఎమ్మెల్యేలను పోలీసులు అక్కడి నుంచి తరలించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డా యి. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఎంకే స్టాలిన్ ముఖ్య మం త్రి పదవి నుంచి తప్పుకోవాలని అన్నాడీఎంకే శ్రేణులు డిమాండ్ చేశారు. జూన్ 24న రాష్ట్రవ్యా ప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే పళనిస్వా మి వెల్లడించారు. ఇక ఈ ఘటనకు బాధ్యులైన 11 మందిని ఇప్పటి వర కు అరెస్ట్ చేశారు. జిల్లా కలెక్టర్ బదిలీ కాగా, ఎస్పీని సస్పెండ్ చేశారు. మరో 22 మంది ఎక్సైజ్ సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. ఈ ఘటనపై సిబిఐ విచారణకు ముఖ్య మంత్రి స్టాలిన్ (Minister Stalin) ఆదేశించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.