–నెంబర్ ప్లేట్ లు లేని 551 వాహ నాలపై కేసులు నమోదు
–నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో వాహనాలకు నంబర్ ప్లేట్లు (NUMBER PLATES) లేకుండా నడపవద్దని, ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు (Special drives) నిర్వహిస్తూ ట్రాపిక్ నిబంధనల విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కేసులు (CASE)నమోదు చేయబ డుతాయని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు. శుక్రవారం ఆయ నొక ప్రకటన విడుదల జిల్లా వ్యాప్తం గా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 551 వాహనాలను పట్టుబడి చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో చా లా మంది వాహనదారులు తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలపై ప్రయాణిస్తున్నారని ఇకనైనా తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విదంగా ఉండాలని అన్నారు. కొంత మంది నంబర్ ప్లేట్ లేకుండా వాహనాల నడుపుతూ అనేక నేరాలకు, దొంగ తనాలకు పాల్పడుతున్నారని అ న్నారు. అలాగే ప్రతి వాహనానికి నంబర్ స్పష్టంగా కనిపించే విధంగా నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాల ని లేని యెడల U/S 80 (A) 177 ఎంవీ ఆక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయి అని తెలిపారు.