–జ్యుడిషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిoచిన కోర్టు
MLC kavitha: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam)కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత (MLC kavitha) జ్యుడిషియల్ కస్టడీని (Judicial custody) రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని (Judicial custody)జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ముందు ఆమె ను వర్చువల్‌గా సీబీఐ అధికారులు హాజరుపరిచారు.దేశవ్యాప్తంగా సంచ లనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ (areest)చేసింది. అనంతరం ఆమె జ్యుడిషియల్ కస్టడీలోభాగంగా న్యూఢిల్లీలోని తీహాడ్ జైల్లో (In Tihad Jail) ఉన్నా రు. ఆ తర్వాత ఇదే కేసులో ఆమె ను సీబీఐ సైతం విచారించింది. ఆ క్రమంలో ఆమె నుంచి కీలక విష యాలను సీబీఐ రాబట్టింది.