EMI: ప్రస్తుత రోజులలో చాలామంది ఉద్యోగులు (employees)లోన్స్ తీసుకుని మరి ఈఎంఐలు చెల్లిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఇక కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్లు ఈఎంఐలు (EMI)అమౌంట్ సమయానికి కట్టలేకపోతూ ఉంటారు. ఆ విధంగా కొన్ని ఈఎంఐలు కట్టే సమయానికి డబ్బు ఏర్పాటు చేసుకోలేకపోతే., రుణం తీసుకున్న తేదీ రోజున ఈఎంఐలు చెల్లించకు పోతే అవి బౌన్స్ అవుతాయి. ఈ క్రమంలో బ్యాంకు (bank) లేదా ఫైనాన్షియల్ సంస్థ (financial)వారు ఈ అమ్మాయి తీసుకున్నవారు సమయానికి చెల్లించపోతే వారు చెల్లించవలసిన మొత్తం పై 500 రూపాయలు జరిమానా విధిస్తుంది. ఇక అనేకసార్లు ఈఎంఐలు కరెక్ట్ సమయానికి చెల్లించకపోతే కూడా వారి సిబిల్ స్కోర్ పై దెబ్బతింటుంది. సిబిల్ స్కోర్ (cibil score)పై ప్రభావితం చేయకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి..
ఈఎంఐలు (EMI) కరెక్ట్ సమయానికి కట్టకపోతే మీరు ముందుగా ఋణం ఎక్కడ తీసుకున్నారో ఆ బ్యాంకు శాఖ వద్దకు వెళ్లి బ్యాంకు మేనేజర్ ను కలిసి అసలు సమస్యను వివరించండి. తదుపరి వాయిదాను కరెక్ట్ సమయానికి చెల్లిస్తామని వారికి తెలుపండి. ఒకవేళ మీ సమస్య మరి పెద్దది అయితే.. మీ ఈఎంఐలు కొన్ని నెలల పాటు వాయిదా వేయాలని బ్యాంకు మేనేజర్ కు రిక్వెస్ట్ (request)పెట్టుకోండి. ఇక అంతేకాకుండా కొన్ని నెలల తర్వాత ఆ డబ్బులు ఏర్పాటు చేసి మొత్తం ఒకేసారి కూడా చెల్లించుకోవచ్చు.
ఇక ఈఎంఐలు కట్టే సమయానికి సరిగా శాలరీ(salary )రాకపోవడం లాంటి కారణాలు ఉంటే ఈఎంఐ తేదీని మార్చుకునే సౌకర్యాన్ని కల్పించాలని బ్యాంకు మేనేజర్ కు రిక్వెస్ట్ చేయచ్చు. ఒకవేళ ఈ అమ్మాయి కరెక్ట్ సమయానికి మూడు నెలల పాటు కట్టకపోతే బౌన్స్ (bounce)అవుతుంది. బ్యాంకు మేనేజర్ మీ సిబిల్ స్కోర్ నివేదికను పంపిస్తారు. అలాంటి సమయంలో సిబిల్ ప్రతికూల నివేదికను పంపించవద్దని మీ బ్యాంకు మేనేజర్ కు రిక్వెస్ట్ పెట్టుకోండి. కొన్ని నెలల తర్వాత మొత్తం చెల్లిస్తామని బ్యాంకు మేనేజర్ కు తెలియజేస్తే మీ సిబిల్ స్కోర్ నివేదికకు పంపించకుండా వారు ఉంటారు.