Loan waiver: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రైతులకు 2018 జూన్ ఖరీఫ్ సీజన్ నుండి 2024 వరకు రెండు లక్షల రుణమాఫీ (Loan waiver) వర్తింపచేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు బండా శ్రీశైలం, సయ్యద్ హశంలు కోరారు.శనివారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో డిఆర్ఓ రాజ్య లక్ష్మి(DRO Rajya Lakshmi) కి సీపీఎం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఏకకా లంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడం హర్షణీయమ ని అన్నారు. 2018 డిసెంబర్ నుం డి 2023 డిసెంబర్ వరకు కాల పరిమితి విధించడం వలన కొంత మంది రైతులకు (FARMERS)రుణమాఫీ వర్తిం చలేకపోవడంతో ఇబ్బందులు పడ వలసి వస్తుందని అన్నారు. ప్రభు త్వం పునరాలోచన చేసి 2018 జూన్ నుండి నేటి వరకు రైతుల బ్యాంకు రుణాలు మాఫీ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం మాదిరిగా రుణమాఫీ పేరుతో వడ్డీ భారం రైతు లపై (FARMERS) పడే విధంగా చేసినట్టు కాకుం డా ప్రభుత్వం ప్రకటించిన ఏకకాల రుణమాఫీ తక్షణమే అమలు జరిపి ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారం భం అయినందున వ్యవసాయ పెట్టుబడులకు తక్షణమే బ్యాంకు రుణాలు (Bank loans)ఇవ్వాలని ఎరువులు విత్తనాలు పురుగుల మందులు అందుబా టులో ఉండే విధంగా, నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా తగు చర్యలు తీసు కోవాలని కోరారు.ఈ కార్య క్రమం లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు మారగోని నగేష్ తదిత రులు పాల్గొన్నారు.