Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (Whatsapp)యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫ్యూచర్లను (New fEATURES) ప్రవేశపెడుతూ ఉంటుంది. యూజర్లను ఆకర్షణ విధంగా నూతన ఫ్యూచర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ (UPDATE) ఇవ్వడంతో పాటు ఆ ఫ్యూచర్ ను ఆధునిక టెక్నాలజీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే తాజాగా వాట్సప్ వీడియో కాల్ కు (VIDEO CALLS) మూడు కొత్త ఫ్యూచర్ లను అందించడంతో బాగా ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా.. మరోవైపు వాట్సప్ కాల్ కు (WHATSAPP CALLS) మరికొన్ని ఫ్యూచర్లను యాడ్ చేయాలని తెలుస్తోంది. వాటిలో ఒకటి “AR కాల్ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్” (AR Call Effects and Filters) అయితే , మరొకటి “బ్యాక్ గ్రౌండ్ చేంజింగ్” (“Background Changing”) ఇక వీటి ప్రయోజనాల గురించి చూస్తే..
ఈ కొత్త ఫీచర్లు ఆండ్రాయిడ్ బీటా వర్షన్ (Android beta version)లో పనిచేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఫీచర్ “AR కాల్ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్” డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉంది. ఈ ఫీచర్ ద్వారా వచ్చే కాల్ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ (Call effects and filters) కాల్స్‌ను మరింత అట్రాక్టివ్, ఇంటరాక్టివ్ గా చేస్తాయి . దీని ఫలితంగా ఒకే ఫేస్ తో బోరింగ్ స్క్రీన్ ను చూడటం కంటే ఎక్కువ ఎఫెక్ట్స్ ఫిల్టర్స్ చూడవచ్చని వాట్సాప్ తెలిపింది. ఈ కొత్త ఫీచర్లు అతి త్వరలోనే వాట్సాప్ కు రావచ్చని ప్రముఖ వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WeBetaInfo) సూచిస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌లో ఉన్నట్లుగా కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ ను మార్చే ఆప్షన్ ను కూడా తీసుకోని రాబోతున్నట్లు తెలుస్తుంది. ఒక టిప్‌స్టర్ ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ ఇంటర్‌ఫేస్‌ను చూడగలిగాడు. దీనిలో కాల్ స్క్రీన్ కింద ఫిల్టర్లు, బ్యాక్ గ్రౌండ్స్, ఎఫెక్ట్ లు కూడా ఉండబోతున్నాయి. ఈ రాబోయే టూల్ గురించి వివరాలను పంచుకుంటూ.., “యూజర్లు స్కిన్ లుక్ ను సాఫ్ట్‌గా చేయడానికి టచప్ టూల్ వంటి డైనమిక్ ఫేస్ ఫిల్టర్లను కూడా వాడుకోవచ్చు. చీకటి పరిసరాలలో విజిబిలిటీని మెరుగుపరచడానికి లో లైట్ మోడ్ ను ఉపయోగించి కాల్స్ ను కస్టమైజ్ చేసుకోవచ్చని ఒక WeBetaInfo రీసెంట్ పోస్ట్ లో యూజర్స్ కోసం తెలియచేసింది.
ఫీచర్ డెస్క్‌టాప్‌కు (feature desktop)కూడా రానుంది:
అలాగే వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్ చేంజింగ్ ఆప్షన్ (Background changing option) ను డెస్క్‌టాప్ వెర్షన్ కు కూడా విస్తరించాలని ప్లాన్ లో ఉన్నటు తెలుసుతుంది. చాలా ముఖ్యమైన వర్క్ కాల్స్ బిగ్ స్క్రీన్‌ల నుంచి జరుగుతాయి. కాబట్టి, డెస్క్ టాప్ యూజర్లకు దీని కారణంగా చాలా ప్రయోజనం ఉండబోతుందని యూజర్స్ భావిస్తున్నారు. ఇక మరో వైపు కొంత మంది హోమ్ ఆఫీస్ లేదా ఇతర ప్రైవేట్ ప్లేసుల నుంచి కాల్ చేస్తున్నప్పుడు, బ్యాక్‌గ్రౌండ్‌ను హైడ్ చేయాలని అనుకునే వారికీ ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని వాట్సాప్ సంస్థ వారు తెలిపారు.
కాల్స్ లో డిజిటల్ అవతార్స్ (Digital avatars):
వాట్సాప్ వీడియో కాల్స్‌లో డిజిటల్ అవతారంతో (Digital avatars) ముఖాన్ని మార్చే సామర్థ్యాన్ని కూడా యూజర్లకు అందించబోతుంది. ఈ ఫీచర్ వీడియో కాల్స్‌తో ఫేస్ రివీల్ చేయకూడదని భావించే వారికి బాగా సహాయ పడుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్లన్నీ కూడా టెస్టింగ్, డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉన్నాయని, ఈ ఫీచర్లు ముందుగా పబ్లిక్ బీటా వెర్షన్‌లో రిలీజ్ అవుతాయి. అనంతరం మిగతా యూజర్లందరికీ రిలీజ్ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫీచర్స్ ను మీరు కూడా యూస్ చేసుకొని ఎంజాయ్ చేయండి.