Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Young rebel star Prabhas) హీరోగా నటించిన సినిమా కల్కి 2898AD. ఇక ఈ సినిమాను డైరెక్టర్ నాగ్అశ్విన్ (Nagashwin) రూపొందించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. 600 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా బృందం (cinima unit). ఇక ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన హీరో హీరోయిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas fans) అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లను చూసి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి , అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ టీమ్ (Makers team) ప్రకటించింది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre-release event) కూడా నిర్వహించారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మూవీ స్టోరీ గురించి తెలియజేసే కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా కల్కి సినిమా ధరల పెంపు అదనపు షోలకు పర్మిషన్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)నిర్ణయం తీసుకుంది. జూన్ 27 నుంచి జూలై 4 వరకు టికెట్ ధరలను (Ticket prices పెంచుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) వారు టికెట్ ధరల పెంపు అలాగే అదరపు షోలకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసినదే. ఈ తరుణంలోనే తెలంగాణ ప్రభుత్వం కల్కి సినిమా టికెట్లపై ఏకంగా 200 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75 పెంచుకోవచ్చు, అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో(Multiplex theaters) రూ.100 వరకు పెంచుకునే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా రిలీజ్ నాడు ఉదయం 5.30 గంటలకు ఎర్లీ షోకు కూడా అనుమతి ఇవ్వడంతో ఫాన్స్ ఖుషి అవుతున్నారు.
కల్కి సినిమా సింగిల్ స్క్రీన్ లో (Single screen) రూ.265, మల్టీప్లెక్స్ రూ.413గా టికెట్ రేట్లు ఉండనున్నట్లు సమాచారం. బెన్ ఫిట్ షో విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.377, మల్టీప్లెక్స్ రూ.495గా ఉండవచ్చు అని అంచనా. ఆన్ లైన్ లో బుకింగ్, త్రీడీ గ్లాస్ ఛార్జీలు అదనంగా పే చేయాల్సిందే. దీని ప్రకరాం ఏకంగా ఒక్కో టికెట్ ధర రూ.500కి మించి ఉండబోవచ్చు. ఇక అంధ్రాప్రదేశ్ లో కూడా ఈ సినిమా టికెట్ రేట్లను (Ticket rates) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఇక ఈ సినిమా ప్రభాస్ కి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో!