Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandrababu : వరించిన పోల’ వరం’

–వారం రోజుల్లోనే కేంద్రం జోక్యం చేసుకునేలా మంత్రాగం
–పోలవరం సవాళ్ల పరిస్కారానికి అంతర్జాతీయ నిపుణులు
–అమెరికా, కెనడాల నలుగురు డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్‌ ఇంజినీరింగ్, హైడ్రాలిక్‌ సంబంధిం చిన అంశాల్లో నిష్టాతులు
–ఈ నెల 27 నుంచి జులై 5 వరకు పోలవరంలో తిష్ట వేసి స్ధానిక పరి స్థితులఅధ్యయనం
–కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రా జెక్టు అథారిటీ స్పందించడంతో పోలవరం పరుగులు

Chandrababu : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వరప్రధాయని పోలవరం మళ్లీ పతా కశీర్షికలకు ఎక్కబోతోంది. ఏపీలోని ‘ఏ ‘అంటే అమరావతి ‘ పి’ అంటే పోలవరం అంటూ ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన మొట్టమొదట గా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. ఆ వ్యాఖ్యల్లో పోలవరానికి ఎoతటి ప్రాధా న్యత ఉందో వారం గడవకముందే సాక్షాత్కారమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu )పోలవరాన్ని సందర్శించిన వా రం రోజుల్లోనే ప్రాజెక్టులో కదలిక రావడం ఎన్డీఏ లో చంద్రబాబు ప్రాధాన్యత ఏమిటో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఢిల్లీలో జరిపిన అవసరం మేరకు తతంగం ఎట్టకేలకు పోలవరంలో కదిలిక తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) అథారిటీ స్పందించి అడుగులు ముందుకుపడ్డాయి. దాంట్లో భాగం గానే పోలవరం అనాదిగా ఎదు ర్కొంటున్న పెను సవాళ్లను పరిష్క రించేందుకు అంతర్జాతీయనిపుణు లను పంపేందుకు చర్యలు ప్రారం భించింది. అమెరికా, కెనడా దేశా లకు చెందిన నలుగురు డ్యాం నిర్వ హణ, భద్రత, సివిల్‌ ఇంజినీరింగ్, హైడ్రాలిక్‌ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణుల ను ఎంపిక చేసి పోలవరం పంపించ నున్నారు.వీరు ఈ నెల 27 నుంచి జులై 5 వరకు పోలవరంలోనే మ కాం వేసి ఇక్కడి పరిస్థితులను అ ధ్యయనం చేస్తారు. అనంతరం పో లవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు. ఈ నిపుణులను పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)అథారిటీ నియమిం చింది. వీరు మూడు నెలలకోసారి పోలవరం సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యేవరకూ సాంకేతికంగా అండదండలు అందించనున్నారు.

నలుగురి బృందం పర్యటన…
కేంద్రo పంపించిన నలుగురు నిపుణుల బృందంలో ఇద్దరు అమెరికా వాళ్లు, మరో ఇద్దరు కెనడాకు చెంది నవారుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాకు చెంది న డేవిబ్ బి.పాల్ (David B. Paul) డ్యాం భద్రత, మౌ లిక వసతుల నిర్వహణలో 35 ఏళ్ల అనుభవం ఉండగా, అంతర్జా తీయ డ్యాం భద్రతా సంస్థలో సీని యర్‌ కన్సల్టెంట్‌గా ఉన్నారు. ఫ్లోరి డాకు చెందిన గియాస్ ఫ్రాంకో డిసి స్కో పెద్ద డ్యాంల నిర్మాణం, నిర్వ హణ, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో 28 సంవత్సరాల అనుభవం ఉంది. అ డ్వాన్స్‌డ్‌ స్ట్రక్చరల్‌ సొల్యూషన్స్‌లో చీఫ్‌ ఇంజినీరుగా నైపుణ్యం సాధిం చారు.వీరు ఈ నెల 27 నుంచి జులై 5 వరకు పోలవరంలోనే తిష్ట వేసి ఇక్కడి పరిస్థితులను అధ్యయ నం చేయనున్నారు. తదనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివే దిక సమర్పిoచ్చేందుకే ఈ నిపుణు లను పోలవరం ప్రాజెక్టు అథారిటీ నియమించడం గమనార్హం.

కమిటీ సభ్యులు మూడు నెలలకోసారి పో లవరం సందర్శిస్తారు. నిర్మాణం పూర్త య్యేవరకూ సాంకేతికంగా అండదండలు అందించనున్నారు. కెనడాకే (canada) చెందిన మరో నిపుణుడు సీస్ హించ్‌బెర్గర్ జియోటెక్నికల్‌ ఇంజినీరింగ్, నీటిపారుదల నిర్వ హణలో 25 ఏళ్ల అనుభవం ఉంది. అంతర్జాతీయ జియోటెక్నికల్‌ కన్సల్టెంట్‌గా ఉన్నారు.ఎగువ కాఫర్‌ డ్యాం లో అధిక సీపేజీ వస్తోంది. అ దే ప్రాజెక్ట్ భవితవ్యానికి సవాలుగా ఉంది. ఫలితంగా ఆ కట్టడం ఆధా రంగా చేసుకునే పనులకు అవాంత రం ఏర్పడుతోంది. ఇప్పటి వరకు దీన్ని అధ్యయనం చేసిన వారు ఇక్కడ రసాయనిక గ్రౌటింగ్‌ చేయా లని సిఫార్సు చేశారు. ఫిజోమీటర్లు ఏర్పాటుచేసి నిరంతరం సీపేజీని అంచనా వేయాలని పేర్కొన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు (International experts)ఈ అంశాలు పరిశీలించి పరిష్కారం సిఫార్సు చేయాలి. ప్రధాన డ్యాంలో భాగంగా గోదావరి నదీగర్భంలో కట్‌ ఆఫ్‌ వాల్‌గా నిర్మించిన డయాఫ్రం వాల్‌ ఎంతో కీలకం. 2020 భారీ వరదల్లో ఇది ధ్వంసమయింది. దీని కి మరమ్మతులా, కొత్తగా మళ్లీ నిర్మించాలా అన్నది వీరు తేల్చాల్సి ఉంది. ప్రధాన డ్యాం నిర్మించేచోట ఉన్న ఈ సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది. వైబ్రో కాంపాక్షన్, వైబ్రో స్టోన్‌ కాలమ్‌ల ఏర్పాటు అంశాన్ని సమీ క్షించి తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలను చూపాల్సిన బాధ్యత ఈ నలుగురు నిపుణుల పై ఉందని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.