–విచారణ కమిషన్ నుంచి లేఖ అందుకున్న మాజీ మంత్రి
Jagadish Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో వివాదాన్ని సృష్టించిన విద్యుత్ కొనుగోళ్ల విచారణ ఆ శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy)వరకు చేరుకుం ది.విద్యుత్ కమిషన్ (Electricity Commission)నుంచి తనకు లెటర్ వచ్చిందని కమిషన్‌కు వాం గ్మూలం ఇచ్చిన వారిపై తన అభి ప్రాయం చెప్పాలని లెటర్ (letter) పంపించారని మాజీమంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సా యాన్ని ఆపడానికి వీలులేదన్నారు. రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని మాట తప్పారని మండి పడ్డారు. కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub-Committee)రైతుల ను మోసం చేయడానికి వేసిన కమి టీ అని చెప్పారు.రైతు రుణమాఫీ తో సంబంధం లేకుండా రైతు బంధు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశా రు.కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతానని అన్నారు.ఛత్తీస్ ఘడ్ మాజీ ము ఖ్యమంత్రి రమణ్ సింగ్, విద్యుత్ అధికారుల నుంచి కమిషన్ సమా చారం తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ అనుమతులు ఇచ్చిన వారిని విచారణకు పిలుస్తారా అని జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ప్రశ్నించారు.