Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Padi Kaushik Reddy: మళ్లీ అధికారంలోకి వచ్చాక అధికారులనకు అన్ని బ్లాక్ డేస్

–హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి హెచ్చరిక

ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం లోని అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేశానని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారు లకు బ్లాక్ డేస్ ఉంటాయని హుజు రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)హెచ్చరించారు. ఫ్లై యాష్ రవాణా కు సంబంధించి నాకు మంత్రి పొ న్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) లీగల్ నోటీసులు (Legal notices) పంపించారని, మీ లీగల్ నోటీసు లకు మా లీగల్ టీమ్ లీగల్‌గా సమాధానం చెప్తుందని, ఫ్లై యాష్ రవాణాలో పొన్నం ప్రభాకర్ డబ్బు లు తీసుకోకపోతే బుధవారం టీటీ డీ వెంకటేశ్వరస్వామి టెంపుల్‌లో ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నిం చారు. బుధవారం రోజు పొన్నం ప్రభాకర్ (Ponnam PrabhakaR) రాకపోతే మరిన్ని నిజాలు బయటపెడతామని సవాల్ విసిరారు.

హుజురాబాద్ ఎమ్మెల్యేకు చెక్కులు ఇవ్వవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhaka)ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెబుతున్నారని ఆరోపించారు. రే వంత్ రెడ్డి సీఎం అయ్యాక పింఛన్ల పెంపు గురించి మర్చిపోయారన్నా రు. మూడు నెలల పింఛన్లను రేవంత్ రెడ్డి (REVANTH REDDY) ఆపారని చెప్పారు. వంద రోజుల్లో పింఛన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. తాము ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబానికి ఇద్దరికి పింఛన్లు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాల్లో ప్రోటోకాల్స్ ఎందుకు పాటించడం లేదని నిలదీ శారు. కళ్యాణలక్ష్మి చెక్కులను తమకు తెలియకుండా పంపిణీ చేస్తున్నారన్నారు. చెక్కులను ఎమ్మెల్యేకు ఇవ్వవద్దని మంత్రి ఎమ్మార్వోలకు ఆదేశాలు ఇస్తు న్నారన్నారు. అధికారులు ప్రోటో కాల్ ప్రకారం చెక్కులు పంచకపోతే హై కోర్టుకు (HIGH COURT)వెళ్తానని తెలిపారు.